వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ఖాతాలపై అశ్లీలం దాడి: నెటిజన్లు జాగ్రత్త..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల రోజుల్లో ఫేస్‌బుక్ ఖాతాలు అశ్లీల వీడియోలతో నిండిపోతున్నాయి. కొత్తగా ఫేస్‌బుక్ ఖాతాలను మాల్ వేర్ వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ మాల్‌వేర్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌పై బూతు బొమ్మలను పోస్టు చేస్తుంది. దీంతో ఫేస్‌బుక్ వినియోగదారులు స్నేహితులు, సన్నిహితుల ఈ మాల్‌వేర్ వద్ద పరువు తీస్తుంది.

'కిలిమ్' మాల్‌వేర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ కొత్త వైరస్ ఫేస్‌బుక్‌లో శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే లక్షల్లో ఫేస్‌బుక్ ఖాతాల్లోకి వెళ్లి వారి 'ఫ్రెండ్స్' ఖాతాలపై కూడా కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేస్తే అంటుకుపోతుంది. బూతు బొమ్మల వీడియోలతో చూడడానికే కొంత ఇబ్బందిగా ఉంటుంది.

Porn malware attack leaves FB users red-faced

ఈ వైరస్‌ను మొదటిసారి ఆగ్రా పోలీసులు కనుగొన్నారు. మీ స్నేహితుల ఖాతా నుంచి "అర్జంటుగా చూడండి... ఎందుకంటే ఇది మీ వీడియోనే" (watch urgent, because it is your video) అనే మెసేజ్ వస్తుంది. దీనిపై ఎవరైనా క్లిక్ చేశారంటే వైరస్ మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌పై వస్తుంది.

కాబట్టి నెటిజన్లూ జాగ్రత్తగా ఉండండి. దీని బారిన పడకుండా ఉండాలంటే ఆ లింకును క్లిక్ చేయకుండా ఉండటం ఒక్కటే మార్గం.

English summary
A malicious software (malware) attack that spammed Facebook timelines and newsfeeds with pornographic images and videos has left hundreds of social media users across India embarrassed, forcing them to clarify to friends and relatives that th- ey had nothing to do with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X