• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రసిక ప్రియులకు Pornhub భారీ షాక్: వీడియోల డౌన్‌లోడ్‌పై కీలక నిర్ణయం: అలాంటి పనులకు బ్రేక్

|

న్యూయార్క్: అడల్ట్ కంటెంట్‌ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న పోర్న్‌హబ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సంస్థాగతమైన కీలక ప్రతిపాదనలను ఆమోదించింది. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్ తరహాలో కొన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. డేటా బ్రీచింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోర్న్‌హబ్ వెబ్‌సైట్ యాజమాన్యం సెట్టింగుల్లో భారీ మార్పులను చేపట్టింది. ఆ సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న నిబంధనలు.. రసిక ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. గుండె దిటవు చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది.

ఆ పనులు కుదరవిక

ఆ పనులు కుదరవిక

పోర్న్‌హబ్ వెబ్‌సైట్ నుంచి ఇదివరకు భారీ సంఖ్యలో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే వారు రసిక ప్రియులు. ఇక ఆ పరిస్థితి ఉండదు. తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. వీడియోల డౌన్‌లోడింగ్ ఇక కుదరదు. వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడింగ్ ఆప్షన్‌ను తొలగించింది. ఛైల్డ్ కంటెంట్‌తో నిండిన వందల కొద్దీ వీడియోలను డౌన్‌లోడ్ కావడం, అవి విస్తృతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్లే అవుతోండటం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోర్న్‌హబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అప్ లోడింగ్‌పైనా ఆంక్షలు..

అప్ లోడింగ్‌పైనా ఆంక్షలు..

పోర్న్‌‌హబ్ వెబ్‌సైట్‌లో సెక్స్ కంటెంట్, అడల్ట్ కంటెంట్‌తో కూడుకుని ఉన్న వీడియోలను అప్ లోడ్ చేయడంపైనా ఆంక్షలను విధించింది. ఇకపై ఎవరు పడితే వారు సెక్స్ కంటెంట్ ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. ఇష్టానుసారంగా వీడియోలను అప్‌లోడ్ చేయడాన్ని నిరోధించడానికి వెరిఫికేషన్ ప్రాసెస్‌ను చేపట్టింది. వెరిఫికేషన్ తరువాతే.. వీడియోలను అప్‌లోడ్ చేయడానికి వీలుంటుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. వీడియోల వెరిఫికేషన్ కోసం పోర్న్‌హబ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది.

ఛైల్డ్ అబ్యూస్ అధికం..

ఛైల్డ్ అబ్యూస్ అధికం..

ఈ మధ్యకాలంలో ఛైల్డ్ సెక్స్ కంటెంట్, ఛైల్డ్ అబ్యూస్‌, చిన్నపిల్లలపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలతో నిండి ఉన్న వీడియోల డౌన్‌లోడ్ భారీగా పెరిగినట్టు సంస్థ యాజమాన్యం గుర్తించింది. అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోలతో పోల్చుకుంటే.. ఛైల్డ్ అబ్యూసింగ్ వీడియోల డౌన్ లోడింగ్ భారీగా పెరిగింది. ఈ వీడియోల వల్ల చిన్నపిల్లలపై లైంగిక దాడులు పెరగడానికి కారణమౌతున్నట్లు ఫిర్యాదులు అందాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ నుంచి అందిన సూచనల మేరకు వీడియోల డౌన్ లోడింగ్‌ను నిషేధించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

 విసా, మాస్టర్‌కార్డ్‌లపై ఆరోపణలు వచ్చిన కొద్దిరోజుల్లోనే..

విసా, మాస్టర్‌కార్డ్‌లపై ఆరోపణలు వచ్చిన కొద్దిరోజుల్లోనే..

పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌తో విసా, మాస్టర్‌కార్డ్‌ కంపెనీల మధ్య ఒప్పందాలు ఉన్నాయి. వీడియోలను అప్‌లోడ్ చేసిన వారికి ఈ కార్డుల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ రూపంలో డబ్బులను చెల్లిస్తుంది వెబ్‌సైట్. దీనిపై అభ్యంతరాలు వెల్లడయ్యాయి. నేషనల్ సెంటర్ ఆన్ సెక్సువల్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాన్ హాకిన్స్.. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తున్నారు. చిన్నపిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల ద్వారా విసా, మాస్టర్‌కార్డ్ కంపెనీలు కూడా లబ్ది పొందుతున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య వీడియో డౌన్‌లోడింగ్ ఆప్షన్‌ను తొలగించడం, నిబంధనలను కఠినతరం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ కంటే..

అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ కంటే..

పోర్న్‌హబ్‌ వెబ్‌సైట్ నుంచి సందర్శించే రసిక ప్రియుల సంఖ్య అసాధారణంగా ఉంటోంది. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీల కంటే ఎన్నో రెట్లు దీనికి విజిటర్స్ ఉన్నారు. ఒకరోజు వ్యవధిలోనే ఈ వెబ్‌సైట్‌ను తిలకించే వారి సంఖ్య 115 మిలియన్లకు పైమాటే. 2019లో 42 బిలియన్ల మంది వెబ్‌సైట్‌ను చూశారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వంటి పరిస్థితుల వల్ల పోర్న్‌హబ్ ట్రాఫిక్.. ఈ ఏడాది భారీగా పెరిగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Pornhub on Tuesday announced that it would allow only identified users to upload content on its website. The move was announced after a report by New York Times highlighted that the website monetizes rape videos, nonconsensual videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X