వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొక్లాం భారత్‌కు అవసరం లేదుగా అంటున్నారు కానీ, యుద్ధం కాదు: చైనా

భారత దేశంపై మిలిటరీ చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డొక్లాం వివాదం రెండు నెలలకు పైగా కొనసాగిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత దేశంపై మిలిటరీ చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డొక్లాం వివాదం రెండు నెలలకు పైగా కొనసాగిన విషయం తెలిసిందే.

చదవండి: గోతి తవ్వుకుంటున్నారు, మాతో సరితూగలేరు, ఏం సాధిస్తారు?: భారత్-జపాన్ మైత్రిపై చైనా అక్కసు

చివరకు.. ఇరు దేశాలు సైన్యాన్ని తొలగించాల్సిందేనని మొదటి నుంచి చెబుతూ వచ్చిన భారత్ తన మాటను నెగ్గించుకుంది. ఈ నేపథ్యంలో డొక్లామ్ అనంతరం భారత్‌కు సైనిక చర్యకు డిమాండ్ చేసిన వారిపై చైనా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

చదవండి: చైనాకు డొక్లామ్ దెబ్బ: వేగంగా మార్పులు, భారత్‌కు జపాన్ బుల్లెట్ ట్రెయిన్

భారత్‌ను వ్యతిరేకిస్తున్న వారికి

భారత్‌ను వ్యతిరేకిస్తున్న వారికి

చైనా ప్రభుత్వ అభిప్రాయాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మేజర్ జనరల్ కియావో లియాంగ్ ద్వారా వెల్లడయ్యాయి. భారత్‌ను వ్యతిరేకిస్తున్న వారికి చైనా వ్యూహాత్మక వైఖరి గురించి సరైన అవగాహన లేదని లియాంగ్ ఓ వ్యాసంలో దుయ్యబట్టడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

భారత్‌తో ఒప్పందం ఎందుకు?

భారత్‌తో ఒప్పందం ఎందుకు?

చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్‌లో మేజర్ జనరల్ కియావో లియాంగ్ ఓ వ్యాసం రాశారు. ఆయన సైనిక వ్యూహకర్త కూడా. డొక్లాం విషయంలో భారత్‌కు గట్టి బుద్ధి చెప్పకుండా ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారని కొందరు చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

పరిష్కారమవ్వాల్సిన విధంగానే

పరిష్కారమవ్వాల్సిన విధంగానే

ఈ నేపథ్యంలో ఆయన రాసిన వ్యాసంలో చైనా, భారతదేశం పొరుగు దేశాలు, పోటీదారులు, అయితే అందరు పోటీదారులను కఠినంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. డొక్లాం ప్రతిష్టంభన పరిష్కారమవ్వాల్సిన విధంగానే పరిష్కారమైందన్నారు. శాంతి మాత్రమే ఉత్తమమైనదని, దేశాన్ని యుద్ధంలోకి నెట్టకుండా నిరోధించేందుకు చేయవలసినదంతా చేయాలన్నారు.

సరైనది సరైన సమయంలో చేయాలి

సరైనది సరైన సమయంలో చేయాలి

చైనా భూభాగంలో రోడ్డు నిర్మాణంతో భారత్‌కు ఏం పని అని చాలామంది అంటారని, ఇది నిజమేనా? ఇది కొంత వరకు సమంజసమేనని, ఎందుకంటే, ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణమే తప్పొప్పులకు సంబంధించినది కాదని, అయితే సరైన దానిని ఏ సమయంలోనైనా చేయడమనేది ఎల్లప్పుడూ సరైనది కాదని అర్థం చేసుకోవాలని, సరైన దానిని సరైన సమయంలో చేయడం మాత్రమే సరైనదని పేర్కొన్నారు.

యుద్ధం అంటున్నారు కానీ

యుద్ధం అంటున్నారు కానీ

చైనా శక్తిని యుద్ధం మాత్రమే వెల్లడించగలదని చాలామంది అనుకుంటున్నారని, అయితే యుద్ధం చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించుకునే అవకాశమున్నపుడు, యుద్ధాన్ని నివారించాలన్నారు. ప్రస్తుతం చైనా మన దేశంతో వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించిందన్నారు.

English summary
China has said that it clearly unhappy with those who have been demanding military action against India, post the Doklam standoff. A major general of the People's Liberation Army said that anti-India commentators do not have a "clear understanding of China's strategic positioning".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X