కరోనా విరుగుడుపై పరిశోధనలు: భారతీయ అమెరికన్ యువతి అనికా చేబ్రోలుకు రూ. 25వేల డాలర్లు
వాషింగ్టన్: ఓ ఇండియన్ అమెరికన్ భారీ మొత్తాన్ని గెలుచుకుంది. కరోనా చికిత్స కోసం పరిశోధనలు చేసిన 14 ఏళ్ల భారతీయ అమెరికన్ అనికా చేబ్రోలు 25,000 అమెరికన్ డాలర్లను తన సొంతం చేసుకుంది. టెక్సాస్‌కు చెందిన అనిక.. 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ 2020లో ఆమె చేసిన కోవిడ్ 19 చికిత్స పరిశోధనలకు చేసింది. కరోనా చికిత్సకు సమర్థవంతమైన ఔషధాన్ని తయారు చేయడంపై ఆమె పరిశోధనలు చేసింది. ఈ మేరకు వివరాలను సీఎన్ఎన్కు వెల్లడించారు.

కరోనా ప్రభావాన్ని తగ్గించే అణువు..
ఈ పాఠశాల అమ్మాయి ఓ అణువును తయారు చేసింది. అది కరోనాకు సంబంధించిన ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. అంతేగాక, కరోనావైరస్ ప్రభావాన్ని మానవ శరీరంపై తగ్గిస్తుందని 8 గ్రేడర్ తెలిపారు. తనకు ఎంతో ఉత్తేజపరిచేదిగా ఉందని, తాను ఇంకా దీని కోసం ప్రత్యేక ప్రక్రియను తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.

సీజనల్ ఫ్లూ నుంచి కరోనావైపు అనిక పరిశోధనలు
అనిక.. కరోనావైరస్పై మొదట్నుంచి ప్రయోగలు, పరిశోధనలు చేయలేదు. ఎక్కువగా సీజనల్ ఫ్లూలపై పోరాడే ఔషధాల తయారీపై మాత్రమే పరిశోధనలు చేశారు. అయితే, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఆమె దీనిపైనే పరిశోధనలు జరపాలని నిర్ణయించుకున్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోనే ఔషధంపై పరిశోధనలు ప్రారంభించారు. తాను రూపొందించిన మెలిక్యూల్(అణవు)పై అనేక కంప్యూటర్ ప్రొగ్రాంలు కూడా చేశారు.

కరోనా రోగులను త్వరగా కోలుకునేలా చేసే మెలిక్యూల్..
సిలికో మెథడాలజీని ఉపయోగించిన అనికా.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మెలిక్యూల్ తయారు చేశారు. ఇది కరోనావైరస్ కు ప్రటీన్ అందకుండా చేసి కరోనా రోగులను త్వరగా కోలుకునేలా చేస్తుంది. అయితే, ఆమె పరిశోధనలు ప్రత్యక్ష పరీక్ష చేశారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే, తాను భవిష్యత్‌లో ఓ గొప్ప మెడికల్ రీసెర్చర్, ప్రొఫెసర్ అవుతానని అనికా తెలిపారు.

అనిక పరిశోధనలవైపే అందరి చూపు..
తన తాత ద్వారా సైన్స్‌పై ఆసక్తి పెరిగిందని అనికా తెలిపారు. తనను సైన్స్ వైపు ఆయనే ప్రోత్సహించారని తెలిపారు. ఆయన ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్.. కావడంతో ఆయన ప్రోత్సాహంతో తాను కూడా సైన్స్‌పై ఆసక్తి పెంచుకున్నట్లు వెల్లడించారు.
కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అనేక మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉండగా.. ఈ 14ఏళ్ల అనికా చేసిన పరిశోధనలు, ప్రయోగాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే కరోనా అంతమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.