వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో మరో అద్భుతం: సూపర్ ఎర్త్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు..ఈ గ్రహం ప్రత్యేకత ఏంటి..?

|
Google Oneindia TeluguNews

అంతరిక్షంలో మరో అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడికి అతి దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం కక్ష్య చుట్టూ ఈ కొత్త గ్రహం తిరుగుతున్నట్లు కనుగొన్నారు. ఇదే అంశాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం జీవనం సాగించేందుకు అనువైన రెండు గ్రహాలకు ఆతిథ్యం ఇచ్చినట్లయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2016లో " ప్రాక్సిమా బీ" అనే గ్రహంను కనుగొనగా తాజాగా "సూపర్ ఎర్త్" పేరుతో ప్రాక్సిమా సీ అనే గ్రహంను కనుగొన్నారు.

భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్ ఎర్త్

భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్ ఎర్త్

ప్రాక్సిమా సెంటారీ నక్షత్రంకు సమీపంలో ఉన్న సూపర్ ఎర్త్‌ భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతరిక్షంలో ఒక్క కాంతి సంత్సరం 6 ట్రిలియన్ మైళ్లకు సమానం. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ గ్రహం ప్రాక్సీ సీ సైజులో భూమికంటే పెద్దదిగా నెప్ట్యూన్ గ్రహం కంటే చిన్నదిగా ఉందని చెప్పారు. అయితే ఈ సూపర్ ఎర్త్‌పై ఉష్ణోగ్రతలు 40 కెల్విన్‌లుగా ఉందని దీన్ని బట్టి చూస్తే ఈ గ్రహంపై జీవనం సాగించడం కాస్త అనుమానమే అని చెప్పారు పరిశోధనలు చేసిన మారియో డమాస్సో. దీనిపై జీవనం ఉన్నట్లు ఇప్పుడప్పుడే నిర్థారించలేమని అన్నారు డమాస్సో. ఈ గ్రహంపై హైడ్రోజన్ హీలియంల జాడను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

 రేడియల్ వెలాసిటీ టెక్నిక్ ద్వారా బరువును కనుగొనే ప్రయత్నం

రేడియల్ వెలాసిటీ టెక్నిక్ ద్వారా బరువును కనుగొనే ప్రయత్నం

గ్రహాలు ఎలా ఏర్పడతాయని విశ్లేశించేందుకు ప్రాక్సిమా సీ యొక్క ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాక్సిమా సెంటారీ చుట్టూ ఒకసారి తిరిగేందుకు సూపర్ ఎర్త్‌కు చాలా సమయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ప్రాక్సీ సెంటారీ నక్షత్రం చుట్టూ తిరిగేందుకు సూపర్ ఎర్త్ గ్రహం బరువును కూడా కనుగొన్నట్లు చెప్పారు. బరువును అంచనా వేసేందుకు రేడియల్ వెలాసిటీ టెక్నిక్‌‌ను ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ గ్రహాల నుంచి వెలువడే గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా అంచనా వేస్తామని శాస్త్రవేత్తలు వివరించారు.

సూపర్ ఎర్త్ ఒక రాతి గ్రహం

సూపర్ ఎర్త్ ఒక రాతి గ్రహం

సూపర్ ఎర్త్ గ్రహం భూమికంటే పెద్దదిగా ఉండే రాతి గ్రహం అని చెప్పిన శాస్త్రవేత్తలు.... ఈ గ్రహం చుట్టూ ఎలాంటి భారీ స్థాయిలో వాయువులు ఉండవని స్పష్టం చేశారు. సూపర్ ఎర్త్ గ్రహాలు భూమికంటే 10 రెట్లు పెద్దవిగా ఉండటంతో పాటు రాతి గ్రహాలుగా ఉంటాయని నాసా చెబుతోంది. అయితే ఈ రాతి లక్షణాలు ఎప్పటి వరకు ఉంటాయో శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పలేకున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఈ సూపర్ ఎర్త్ గ్రహంపై జీవం ఉంటుందా లేదా అనేదానిపై కూడా కచ్చితమైన స్పష్టత శాస్త్రవేత్తలు ఇవ్వలేకున్నారు.

జీవనం కష్టమే అంటున్న శాస్త్రవేత్తలు

జీవనం కష్టమే అంటున్న శాస్త్రవేత్తలు

అంతకుముందు నాసా చేసిన పరిశోధనల్లో ఒక ఆసక్తికరమైన అంశం గురించి చెప్పారు. ప్రాక్సిమా బీ పై జీవనం సాగించేందుకు ప్రాక్సిమా బీ గ్రహం సపోర్ట్ చేయదని చెప్పారు. జీవనం సాగించేందుకు అవసరమైన సదుపాయాలున్న పరిధిలో ఉన్నప్పటికీ దానిపై మనుగడ కష్టమే అని నాసా శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అక్కడ ద్రవ రూపంలో నీరు ఉన్నప్పటికీ కష్టమే అని చెప్పారు. ప్రాక్సిమా బీ కూడా సెంటారీ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. నాసా ప్రకారం ప్రాక్సిమా బీ బరువు భూమి కంటే 1.27 రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 11.2 రోజుల సమయం తీసుకుంటుందని చెప్పారు.

English summary
A new 'Super-Earth' orbiting Proxima Centauri, which is the Sun's nearest neighbouring star, has been discovered by scientists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X