• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

7.7 తీవ్రతతో భారీ భూకంపం: వణికిన ద్వీపదేశం

|

న్యూయార్క్: కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. కరేబియన్ ద్వీప దేశాల సముదాయంలోని జమైకా, క్యూబా మధ్య సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప ప్రభావం పొరుగునే అమెరికా, మెక్సికోపైనా పడింది. క్యూబాకు సమీపంలో ఉన్న ఫ్లోరిడా, మెక్సికో సిటీల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి.

జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. మూడు అడుగుల ఎత్తు వరకు కెరటాలు ఎగిసి పడే ప్రమాదం ఉందని ప్రకటించింది.

Powerful 7.7-magnitude earthquake hits between Cuba, Jamaica

భూకంప తీవ్రత ప్రభావం క్యూబా ప్రధాన నగరం శాంటియాగోపై తీవ్రంగా పడింది. శాంటియాగోలోని పలు ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తాయి. స్థానికులు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగెత్తారు. వందలాది మంది ఒకేసారి రోడ్ల మీదికి వచ్చారు. సాయంత్రవ వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. జమైకాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ జనసమ్మర్థం అయ్యాయి. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టాలు చోటు చేసుకున్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

క్యూబా, జమైకాలతో పాటు కేమెన్ ఐలండ్స్, హోండూరస్, మెక్సికో, బెలిజే వంటి దేశాల తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భూకంప తీవ్రత ప్రభావానికి మెక్సికో తీర ప్రాంత నగరమైన క్వింటానో రూలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయని గవర్నర్ కార్లోస్ జొవాక్విన్ వెల్లడించారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే.. ప్రాణనష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను సిద్ధం చేశామని అన్నారు.

English summary
A powerful magnitude 7.7 earthquake struck in the Caribbean Sea between Jamaica and eastern Cuba on Tuesday, shaking a vast area from Mexico to Florida and beyond, but there were no reports of casualties or heavy damage. The quake was centered 139 kilometers (86 miles) northwest of Montego Bay, Jamaica, and 140 kilometers (87 miles) west-southwest of Niquero, Cuba, according to the U.S. Geological Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more