వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాం: బిలావల్ భుట్టో

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ కాశ్మీర్ అంశంపై సంచలనం వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కాశ్మీర్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తుందని అన్నారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.

‘కాశ్మీర్‌ను తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే, అది పాకిస్థాన్ లోనిది'
అని బిలావల్ భుట్టో అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అష్రఫ్‌లు అతడికి ఇరువుపులై ఉన్నారు.

PPP patron Bilawal Bhutto vows to 'take back Kashmir from India'

2018లో జరగనున్న ఎన్నికల్లో బిలావల్ పోటీ చేయనున్నాడు. అదే సమయంలో తన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలను రెచ్చగొట్టేందుకే బిలావల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతలు భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పుకుంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

కాగా, బిలావల్ భుట్టో తల్లి బెనజీర్ భుట్టో రెండు సార్లు పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ 1967లో పిపిపిని స్థాపించారు. జుల్ఫికర్ అలీ 1970లో ప్రధానిగా పని చేశారు. బిలావల్ తండ్రి అసిఫ్ అలీ జర్దారీ కూడా 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

English summary

 Bilawal Bhutto Zardari, the 'Gen Next' politician of Pakistan, has said that his Pakistan People's Party (PPP) would get back entire Kashmir from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X