వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌దే విజయం: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్ -కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగానే కాకుండా తీవ్ర ఉత్కంఠ రేపినవిగానూ 2020 అధ్యక్ష ఎన్నికలు నిలిచాయి. ఎలక్షన్ డే(మంగళవారం) ముగిసి, బుధవారం మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. 86 ఎలక్టోరల్ ఓట్లతో విజేతను నిర్ణయించే 7 రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే, తుది ఫలితాలు రాకముందే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను గెలిచేశానని ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై..

కొవిడ్ వ్యాక్సిన్: గుడ్ న్యూన్ చెప్పిన సీరం -జనవరిలోనే అదుబాటులోకి -ఫేజ్-3 కూడా సక్సెస్కొవిడ్ వ్యాక్సిన్: గుడ్ న్యూన్ చెప్పిన సీరం -జనవరిలోనే అదుబాటులోకి -ఫేజ్-3 కూడా సక్సెస్

 కేఏపాల్ మండిపాటు..

కేఏపాల్ మండిపాటు..

ఫైనల్ రిజల్ట్ కంటే ముందే ట్రంప్ విక్టరీ ప్రకటన చేయడంపై ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉంటోన్న పాల్.. ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. తాజా పరిణామాలపై వీడియోల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తీకరించిన ఆయన.. ట్రంప్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలా కుదరదు..

అలా కుదరదు..

‘‘అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ తానే గెలిచాని ప్రకటించుకోవడం ఎలా కుదురుతుంది? అసలాయన ఆ ప్రకటన ఏలా చేయగలిగారు? అవసరమైతే ఓట్ల లెక్కింపును ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్తానంటారా? ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా?'' అని కేఏ పాల్ ఆగ్రహం వెళ్లగక్కారు. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ మ్యాజిక్ ఫిగర్ 270కాగా, బైడెన్ 238 ఓట్లు, ట్రంప్ 213 ఓట్లు సాధించారు. ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. వాటిలో బైడెన్, ట్రంప్ పోటాపోటీగా తలపడుతున్నారు. మరోవైపు..

 గెలిచేది ట్రంపే..

గెలిచేది ట్రంపే..

అమెరికా అధ్యక్ష ఎన్నికపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ‘‘ఈ ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ గెలిస్తే కచ్చితంగా ఓ వ్యక్తి పాపులర్ అవుతాడు. ట్రంప్ గెలుస్తాడని ఆ జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని, ఎగ్జిట్ పోల్స్, ఫలితాల సరళి ఎలా ఉన్నా, బైడెన్ నుంచి గట్టి పోటీ ఎదురుదైనా, చివరికి గెలిచేది ట్రంపే అని ఆ జోతిష్యుడు చెప్పాడు. అతని పేరును ఇప్పుడే చెప్పదలచుకోలేదు. కానీ ఆయన గీసిన జోతిష్యం మాత్రం మీ ముందు ఉంచుతున్నా''అని మహీంద్రా ట్వీట్ చేశారు. మరి ఈ జోస్యం నిజమవుతుందో లేదో ఇంకాసేపట్లో తేలిపోనుంది..

ఇంకా ఎంత సేపు ఆగాలి? ఎన్నికల ఫలితాల ఆలస్యానికి కారణాలివే -చివరికి విజేత ఎవరంటేఇంకా ఎంత సేపు ఆగాలి? ఎన్నికల ఫలితాల ఆలస్యానికి కారణాలివే -చివరికి విజేత ఎవరంటే

English summary
andhra pradesh politician, praja shanti party chief ka paul, who is also famous in us, slams president donald trump for early victory announcement. indian businessman Anand Mahindra Post On Astrologer Who Predicted Victory For Donald Trump, went viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X