వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్ : ఆయన స్థానంలో మైక్‌పెన్స్ ను నియమించాలంటున్నారు!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం కొనసాగినన్నాళ్లు.. ట్రంప్‌పై ఎన్నెన్ని ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆయనపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేయడంతో.. సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి రాజుకుంది. సహజంగానే దూకుడైన స్వభావం కలిగిన ట్రంప్ ను నియంత్రించడం కష్టమని అమెరికా ప్రొఫెసర్, ప్రముఖ దైవజ్ఞుడు అలాన్ లిచ్ మ్యాన్ అభిప్రాయపడ్డారు.

ట్రంప్‌ను నియంత్రించడం కష్టం గనుక ఆయన స్థానంలో.. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరొక నమ్మకస్తున్ని అమెరికా అధ్యక్షుడిగా నియమించాలనేది ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ త్వరలో అభిశంసనకు గురికాబోతున్నారంటూ లిచ్ మ్యాన్ అభిప్రాయపడడం సంచలనం రేకెత్తిస్తోంది. ట్రంప్ కు ప్రత్యామ్నాయంగా.. మైక్ పెన్స్ ను అమెరికా అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని లిచ్ మ్యాన్ మనసులో మాట బయటపెట్టారు.

Prediction professor’ who called Trump’s big win also made another forecast: Trump will be impeached

రిపబ్లికన్ పార్టీ పెన్స్ ను అమితంగా ఇష్టపడుతోందని, ఆయనైతే చెప్పినట్టు వింటారని, ట్రంప్ ను నియంత్రించడం కష్టమని తెలిపారు. ఇదిలా ఉంటే, ట్రంప్ ప్రభ ఏడాదికే పరిమితమవతుందంటూ న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ డేవిడ్ బ్రూక్స్ పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ట్రంప్ రాజీనామా చేయించడం గానీ అభిశంసనకు గురికావడం గానీ జరుగుతుందన్నారు.

English summary
Few prognosticators predicted a Donald Trump victory ahead of Tuesday night. Polls showed Hillary Clinton comfortably ahead, and much of America (chiefly the media) failed to anticipate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X