వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ క్షణంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం... హోరాహోరీగా, క్రూరంగా...

మూడో ప్రపంచ యుద్ధమే గనుక వస్తే.. గత ప్రపంచ యుద్ధాల మాదిరిగా నెలలు, ఏళ్ల తరబడి జరగదు. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్‌ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది.

గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది.

ఉత్తరకొరియా పరిణామాలే...

ఉత్తరకొరియా పరిణామాలే...

మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్‌ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్‌ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు.

మోహరించిన అమెరికా సైన్యం...

మోహరించిన అమెరికా సైన్యం...

దక్షిణ కొరియాలో అమెరికా థాడ్‌ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు.

చైనా హెచ్చరికలు కూడా...

చైనా హెచ్చరికలు కూడా...

ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్‌ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది.

ప్రపంచం.. మూడు కూటములుగా..

ప్రపంచం.. మూడు కూటములుగా..

ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి పరస్పరం యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. అయితే ఆ బృందాలు ఎవరి నాయకత్వాన ఏర్పాడతాయనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు.

రష్యా ఊసే లేదంటే...

రష్యా ఊసే లేదంటే...

రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్‌ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్‌ తనను గుర్తుపట్టకుండా ముఖానికి చిత్రమైన మాస్క్‌ ధరించాడు.

English summary
The online activists declared “citizens will be the last to know” when war breaks out as governments ready themselves for battle. Anonymous used their signature Guy Fawkes character to deliver the warning in a six-minute video. With the aid of voice changer technology, the robotic sounding hacker urges viewers to “prepare for what comes next”. Earlier this month US President Donald Trump warned a “major, major conflict” with North Korea is possible as tensions escalate over Pyongyang's nuclear and missile programmes. The hacker group said: “All the signs of a looming war on the Korean peninsula are surfacing, watching as each country moves strategic pieces into place but unlike past world wars although there will be ground troops the battle is likely to be fierce. brutal and quick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X