వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్ జిల్ జిగా జిగా: 11 నిమిషాలు: భర్త బిడెన్‌కు లిప్‌లాక్: నో టైమ్ టు వేస్ట్: దాని మీదే తొలి ట్వీట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడి సజావుగా సాగిపోయింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బిడన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆ తరువాత జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 21 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది.

జో బిడెన్ ప్రమాణ స్వీకార ప్రక్రియ 11 నిమిషాల్లో పూర్తయింది. బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 127 సంవత్సరాల చరిత్ర ఉన్న బైబిల్ అది. లెదర్ కవర్ ‌పేజీ ఉన్న ఆ బైబిల్ 1893 నుంచి బిడెన్ కుటుంబంలో ఉంటోంది. ఇదివరకు ఆయన తొలిసారిగా సెనెటర్‌గా ఎన్నికైనప్పుడు కూడా ఈ బైబిల్ సాక్షిగానే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అదే బైబిల్‌ను వినియోగించారు.

 President Joe Biden sworn in process completed in just 11 minutes, says no time to waste

ప్రమాణ స్వీకార సమయంలో ఆయన భార్య జిల్ బిడెన్ పక్కనే ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆమె భర్త పెదాలపై ముద్దు పెట్టారు. లిప్‌లాక్‌తో గ్రీటింగ్స్ తెలిపారు. ఆ వెంటనే జో బిడెన్ ట్విట్టర్ హ్యాండిల్ మారిపోయింది. ప్రెసిడెంట్ బిడెన్ అనే పేరుతో పోటుస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. అప్పటికప్పుడు తొలి ట్వీట్‌ను పోస్ట్ చేశారు. వృధా చేయడానికి ఒక్క నిమిషం కూడా తమ వద్ద అదనంగా లేదని పేర్కొన్నారు.

సంక్షోభ కాలాన్ని ఎదుర్కొనడానికి తన వద్ద ఏ మాత్రం సమయం లేదని అన్నారు. అందుకే- తక్షణమే తాను వైట్‌హౌస్‌కు బయలుదేరి వెళ్తానని, ఓవల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిస్తానని తెలిపారు. సంక్షోభంలో కూరుకుని, నష్టపోయిన అనేకమంది అమెరికన్ కుటుంబాలను ఆదుకోవడానికి శరవేగంగా తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. రెడీ టు సర్వ్ అంటూ కమలా హ్యారిస్ ట్వీట్ చేశారు.

 President Joe Biden sworn in process completed in just 11 minutes, says no time to waste

English summary
President Joe Biden was sworn in by Chief Justice John Roberts Jr., completing the process 11 minutes before the authority of the presidency formally changed hands. “There is no time to waste when it comes to tackling the crises we face,” the new president said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X