వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్‌లో సొంత ఖాతా ఓపెన్ చేసిన ఒబామా: అరగంటలో లక్షన్నర ఫాలోయర్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లలో భారత ప్రధాని నరేంద్రమోడీదే హవా. తాజాగా మోడీకి చెక్ పెట్టేలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్విట్టర్‌లో అకౌంట్ తెరిచారు. @POTUS పేరుతో ఖాతా తెరిచిన ఒబామా సోమవారం నెటిజన్లకు తన ట్వీట్ ద్వారా పలకరించారు.

President Obama gets his own Twitter account

'హాలో, ట్విట్టర్! నేను బారక్‌ను. నిజంగా ఆరేళ్లు గడిచిన తర్వాతనే నాకంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ ఇచ్చారు' అని తన మొదటి ట్వీట్‌ను ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి స్ధానంలో ఉండి ఖాతా ఓపెన్ చేసిన ఒబామాకి అరగంట వ్యవధిలోపే దాదాపు లక్షన్నర మంది ఫాలోయర్లు ఆ ఖాతాలో చేరిపోయారు.

మరోవైపు @BarackObama అనే అకౌంట్‌ను 2007లో తెరిచిన సంగతి తెలిసిందే. ఇక @POTUS పేరుతో తెరిచిన ఖాతా ద్వారా అమెరికాలోని ప్రజలను నేరుగా ఒబామా ఎంగేజ్ అవుతారు. ఈ ట్విట్టర్ హ్యాండ్లర్ ద్వారా ట్వీట్ చేసే ట్వీట్స్ అన్ని కూడా తానే స్వయంగా చేస్తారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

English summary
US President Barack Obama has just launched his own Twitter feed, the White House has confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X