వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

H-1B Visa:బాంబు పేల్చిన ట్రంప్.. మరిన్ని ఆంక్షలు..ఇండియన్స్‌ పై భారీ ఎఫెక్ట్.?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్ - 1 బీ, ఎల్-1తోపాటు ఇతరత్ర తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలపై దృష్టి సారించారు. ఈ వీసాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకురానున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు చెప్పారు. తద్వారా ఉద్యోగ విషయాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకే ఉంటుందని వెల్లడించారు. కొత్తగా విధించనున్న ఆంక్షలతో చాలామంది అమెరికన్లలో సంతోషం నింపడమే కాకుండా ఈ ఆర్డర్‌తో కొన్ని నిబంధనలు కేవలం అమెరికన్లకు మాత్రమే వర్తించేలా ఉండనున్నాయని పేర్కొన్నారు. చాలా కాలం నుంచి ఒక రంగాన్ని నమ్ముకుని పనిచేస్తున్నవారు ఉన్నారని వారికోసమే కొన్ని మినహాయింపులతో కూడిన ఆర్డర్‌ను తీసుకొస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారితో వాణిజ్యం నష్టాల బాట పట్టినందున అమెరికా చాలా కోల్పోయిందని ట్రంప్ గుర్తు చేశారు.

Recommended Video

H1B Visa... మరిన్ని ఆంక్షలు, భారతీయులకి ట్రంప్ షాక్!! | Oneindia Telugu

ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ జిన్‌పింగ్‌ సహకారం కోరారా? బాంబు పేల్చిన సొంతమనిషిఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ జిన్‌పింగ్‌ సహకారం కోరారా? బాంబు పేల్చిన సొంతమనిషి

 ట్రంప్ నిర్ణయంతో భారతీయులపై ఎఫెక్ట్

ట్రంప్ నిర్ణయంతో భారతీయులపై ఎఫెక్ట్

ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని వేలమంది భారతీయులపై ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇక దీనికి ఆమోదం లభిస్తే అక్టోబర్ 1న అమెరికాకు వెళ్లాల్సిన భారతీయుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. ఏటా అమెరికా జారీ చేసే 85వేల వీసాల్లో 70శాతం భారతీయులవే ఉండటం విశేషం. అయితే ఈ కొత్త నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయులకు ఎలాంటి హాని లేదా ప్రభావం ఉండబోదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇక కొత్త ఆంక్షలు ఈ ఏడాది చివరివరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తాజా ఆంక్షలు భారత కంపెనీలకంటే అమెరికా టెక్ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. ఇందుకు కారణం గత కొన్నేళ్లుగా అమెరికన్లను మాత్రమే ఈ కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి.

 అమెరికా కంపెనీలకు నష్టమేనా..?

అమెరికా కంపెనీలకు నష్టమేనా..?

గత కొన్నేళ్లుగా అమెరికా కంపెనీలు హెచ్‌-1బీ వీసాదారులను రిక్రూట్ చేసుకోవడం తగ్గిస్తూ వస్తున్నాయి. ఇక అమెరికా సంస్థలైన గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ సంస్థల్లో అమెరికన్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 అమెరికా కంపెనీల్లో ఏడు కంపెనీలు హెచ్‌-1బీ వీసాదారులను తమ సంస్థల్లో రిక్రూట్ చేసుకునేవి. ఇక టాప్ టెన్ భారత కంపెనీల్లో హెచ్-1బీ వీసాదారుల నియామకం చాలా తగ్గిపోయింది. అంటే 2016-2019 వరకు 51శాతం నుంచి 24 శాతంకు పడిపోయినట్లు యూఎస్ సిటిజెన్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసుల లెక్కల ప్రకారం తెలుస్తోంది.

 గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

ఇక కంప్యూటర్ ఆధారిత సంస్థల్లో నిరుద్యోగం రేటు పెరిగిపోయినట్లు ఈ మధ్యనే విడుదలైన అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతోంది. జనవరి 2020లో 3 శాతంగా ఉన్న ఉద్యోగ రేటు మే నెలలో 2.5శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఇతర రంగాల్లో ఉద్యోగాలు మాత్రం 4.1శాతం నుంచి 13.5శాతంకు పెరిగాయి. ఇక అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయం వాణిజ్య పరిశ్రమ మొత్తంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజా ఆంక్షలు ఒక్క ఉద్యోగిపై విధిస్తున్నవి కాదని, మొత్తం వాణిజ్యంపై , కొత్త క్లయింట్ ప్రాజెక్టులపై కూడా చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
US President Donald Trump said that he would be signing an Executive Order introducing restrictions on H-1B, L-1, and other temporary work permits by Monday as part of his effort to curb immigration and help local employment in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X