వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్-కిమ్ జాంగ్ భేటీ: కిమ్ ఇంగ్లీష్, సింగపూర్ ఎక్కడుందని వెతుకుతున్న అమెరికన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ చారిత్రక భేటీ నేపథ్యంలో అమెరికన్లు ఎక్కువగా సింగపూర్ ఎక్కడ ఉంది అని గూగుల్‌లో వెతుకుతున్నారు. ఉప్పు - నిప్పులా ఉండే వీరిద్దరి భేటీ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు. ఆ సమయంలో జూన్ 12న వచ్చింది.

Recommended Video

డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ

ట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందేట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందే

వారి భేటీ సామరస్యపూర్వకంగా జరిగింది. ఈ భేటీ విజయవంతమవుతుందా అనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. అమెరికన్లు కూడా ఉత్కంఠతోనే ఉన్నారు. కానీ వారు గూగుల్‌లో వెతికింది సింగపూర్ ఎక్కడ అని. ట్రంప్ - కిమ్‌ల భేటీ సింగపూర్‌లోని కేపెల్లా హోటల్లో జరిగింది.

సింగపూర్ ఎక్కడ ఉందని వెతుకుతున్న అమెరికన్లు

సింగపూర్ ఎక్కడ ఉందని వెతుకుతున్న అమెరికన్లు

గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎక్కువ మంది 'వెర్ ఈజ్ సింగపూర్ ఇన్ ది వరల్డ్' (ప్రపంచంలో సింగపూర్ ఎక్కడ ఉంది) అని కూడా చాలామంది వెతికారు. ఈ భేటీకి రెండు రోజుల ముందు నుంచే ఈ దేశం ఎక్కడుంది అనే ప్రశ్నతో అమెరికన్లు వెతుకుతున్నారు. అంతేకాదు, ఉత్తర కొరియా ఎక్కడ ఉంది?, సింగపూర్ ఓ దేశమా?, సింగపూర్ చైనా లేదా జపాన్‌లో ఉందా? అని వెతికారు.

 ఎక్కువ మంది అమెరికన్లకు పాస్‌పోర్టులు లేవు

ఎక్కువ మంది అమెరికన్లకు పాస్‌పోర్టులు లేవు

సమాచారం మేరకు 40 శాతానికి పైగా అమెరికన్లకు మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయి. అంటే పాస్‌పోర్ట్ లేని వారు వారి దేశాన్ని దాటి వెళ్లని వారనే అర్థం. మరో ముఖ్య విషయం ఏమంటే ఉన్న పాస్‌పోర్టులలోను ఎక్కువ శాతం గత దశాబ్దకాలంలో తీసుకున్నవే కావడం గమనార్హం. ఇక్కడ మరో విషయం ఏమంటే పాస్‌పోర్టు లేకుండానే అమెరికన్లు మెక్సికో, కెనడాలకు ఇటీవలి వరకు ప్రయాణించారు.

సెర్చింజన్‌లో మరిన్ని

సెర్చింజన్‌లో మరిన్ని

ట్రంప్ - కిమ్ భేటీ నేపథ్యంలో మరికొన్ని ప్రశ్నలను కూడా గూగుల్ సెర్చింజన్‌లో వెతికారు. కిమ్ జాంగ్ ఉన్న ఎంత పొడుగు ఉన్నాడు? కిమ్ జాంగ్ ఉన్ ఇంగ్లీష్ మాట్లాడగలరా? కిమ్ జాంగ్ ఉన్ - డొనాల్డ్ ట్రంప్ భేటీ ప్రస్తుతానికి బాగానే కనిపిస్తోంది. శాంతిచర్చలు ముందుకు సాగుతున్నట్లుగా ఉన్నాయి.

ఆసక్తిగా చూసిన కొరియన్ అమెరికన్లు

ఆసక్తిగా చూసిన కొరియన్ అమెరికన్లు

డొనాల్డ్ ట్రంప్ - కిమ్ జాంగ్ ఉన్ సమ్మిట్‌పై కొరియన్ అమెరికన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అమెరికాలో దాదాపు 1.7 మిలియన్ల కొరియన్ అమెరికన్లు ఉంటున్నారు. కాగా, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఎట్టకేలకు కీలక ఒప్పందం జరిగింది. ట్రంప్, కిమ్ మధ్య సింగపూర్‌లోని సెంటోసా ఐల్యాండ్‌లో కేపెల్లా హోటల్లో భేటీ అనంతరం ఇరువురు చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు కూడా.

English summary
As US President Donald Trump landed in Singapore for a historic summit with reclusive North Korean leader Kim Jong-Un, curious Americans went on the Internet to know all about the summit - starting with some basic questions. Data from Google Trends shows a spike in number of searches for 'where is Singapore' as the POTUS landed in the small nation for the key meeting on Tuesday. Search for 'where is Singapore in the world' also saw a surge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X