మీ సైన్యంకు చేతకాకుంటే మా ట్రూప్స్ సిద్ధం: మెక్సికోకు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో ప్రెసిడెంట్ ఎన్రిక్ పెనాకు ఫోన్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో ప్రెసిడెంట్ ఎన్రిక్ పెనాకు ఫోన్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ అరాచకవాదులను మీ సైన్యం అదుపు చేయలేకపోతో అమెరికా ట్రూప్స్‌ను పంపిస్తామని హెచ్చరించారు.
ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్బుక్..
మెక్సికోలో అరాచకవాదులు చాలామంది ఉన్నారని, వారిని మీ సైన్యం అదుపు చేయాలన్నారు. లేని యెడల తమ ట్రూప్స్‌ను పంపించవలసి ఉంటుందని శుక్రవారం ఫోన్ ద్వారా చెప్పారు.
మెక్సికో సైన్యం వారిని అదుపు చేయటం లేదని, మీ సైన్యం భయపడుతుంటే చెప్పాలన్నారు. తమ వారికి ఎలాంటి భయం లేదని, వారే చూసుకుంటారని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే, ట్రంప్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు.
మెక్సికన్ విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం ఇటువంటి ప్రతికూల ఘటనలు ఏమీ జరగలేదని తెలిపింది. పూర్తి నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయి అని పేర్కొంది. ఇదిలా ఉండగా, వైట్ హౌస్ మాత్రం దీని పైన స్పందించేందుకు నిరాకరించింది.