వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసాదారులందరికీ ఉద్యోగాలొద్దు: యూఎస్‌సీఐఎస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా వలసదారులపై కఠిన విధానం కొనసాగిస్తూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ విధానంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, అమెరికా నుంచి మరో సంచలన ప్రకటన వెలువడింది.

అమెరికాలోని ఉద్యోగాలను, ఉద్యోగులను హెచ్1బీ వీసాదారులతో భర్తీ చేయకుండా తీసుకొచ్చే బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపితే చాలా సంతోషమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు.

Prevent jobs from going to H-1B visa holders: USCIS director

వాషింగ్టన్ డీసీలో ఇటీవల సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) ఆధ్వర్యంలో 'ఇమ్మిగ్రేషన్ న్యూస్‌మేకర్' అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా సిస్నా మాట్లాడుతూ.. 2017లో యూఎస్‌సీఐఎస్ 3,65,000(కొనసాగింపు వీసాలతో కలిపి) దరఖాస్తుదారులకు హెచ్1బీ వీసాలను మంజూరు చేసినట్లు తెలిపారు.

వలస సంస్కరణల వల్ల అమెరికా అవసరాలకు తగినట్లుగా ఉద్యోగాలను కల్పించేలా సంస్థలకు ఉన్న సదుపాయాలపై నిషేధం విధించడమే దీనికి సరైన మార్గమని ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ పనితీరు కలిగిన నిపుణులు, అమెరికాకు అవసరమైన వారికి మాత్రమే వీసాలను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

English summary
US Citizenship and Immigration Services (USCIS) director L Francis Cissna has said he would be happy if American law prohibited the replacement of an American by an H-1B visa holder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X