వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ పర్వదినం జరుపుకొవచ్చు..! పాకిస్తాన్ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!!

|
Google Oneindia TeluguNews

ఇస్తామాబాద్/ హైదరాబాద్ : ఓ పక్క కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం తమ రూటు సెపరేటంటోంది. ముస్లిం ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పట్ల పాకిస్థాన్ పౌరులందనికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పవిత్ర రంజాన్ పర్వదినం... కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్..

పవిత్ర రంజాన్ పర్వదినం... కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్..

రంజాన్ పర్వదిన సందర్బంగా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలకు శరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్ అద్యక్షులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్న పాక్ రేడియో దృవీకరించినట్టు తెలుస్తోంది.

శరతులతో కూడిన అనుమతులు.. ఆనందంలో పాక్ ప్రజానికం..

శరతులతో కూడిన అనుమతులు.. ఆనందంలో పాక్ ప్రజానికం..

ప్రార్థనల సందర్బంగా మసీదుల్లో కార్పెట్ వేయకూడదని, ప్రార్ధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని పాక్ ప్రభుత్వం నిబంధనలను విధించింది. అంతేకాకుండా మసీదుకు వచ్చేవారు ఫేస్ మాస్క్ ధరించి, ప్రార్ధన చేసే ముందు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారితో పాటు, 50 సంవత్సరాలు పైబడిన వారికి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని ఆల్వి తెలిపారు.

పాక్ లో కరోనా ప్రమాదఘంటికలు.. ఐనా ఆంక్షలు తొలగిస్తున్న పాక్ ప్రధాని..

పాక్ లో కరోనా ప్రమాదఘంటికలు.. ఐనా ఆంక్షలు తొలగిస్తున్న పాక్ ప్రధాని..

కాగా, ఈ నిబంధనలను పాటించకపోయినా, కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గణనీయంగా పెరిగినా ఈ నిర్ణయంపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో గత నెలలోనే అక్కడి స్థానిక ప్రభుత్వాలు మసీదులలో సామూహిక ప్రార్థనలు, ఇతర మత సమావేశాలను నిరవధికంగా నిషేధించాయి. కాగా, పాకిస్తాన్‌లో ఇప్పటివరకు సుమారు 9వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 176 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రార్థనల్లో సోషల్ డిస్టెన్స్... 50ఏళ్లు పైబడ్డ వారికి నో ఛాన్స్..

ప్రార్థనల్లో సోషల్ డిస్టెన్స్... 50ఏళ్లు పైబడ్డ వారికి నో ఛాన్స్..

ఇంతటి క్లిష్ట సమయంలో కూడా శరతులతో కూడిన అనుమతులు జారీ చేయడం పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సభ్య దేశాలను డబ్ల్యూ హోచ్ ఓ పదే పదే హెచ్చరిస్తోంది. దాదాపు 120దేశాలు లాక్ పాటిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించి సామూహిక ప్రార్థనలకు అనుమతించడం పట్ల పాక్ ప్రజలు హర్షం చేస్తున్నప్పటికి, ఇరుగు పొరుగు దేశాల్లో మాత్రం ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా అంతర్జాతీయ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయాలిన ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

English summary
On the eve of Ramzan, it seems that the mosques have been granted clemency for mass prayers. The meeting was chaired by Pakistani President Arif Alvi in ​​Islamabad. Pak prime minister Imran Khan seems to have made this crucial decision at this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X