వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు మీదే: అభివృద్ధి చెందిన దేశాలకు మోడీ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: వాతావరణ మార్పులకు కారణం మేము కాదని, అయినా ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు మా అభివృద్ధి పైన ప్రభావం చూపిస్తాయని, అభివృద్ధి చెందిన దేశాలు అవి సంపన్నం అవడం కోసం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణ మార్పులు సంభవించాయని ప్రధాని మోడీ అన్నారు.

వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలకు ప్రధాని మోడీ స్పష్టమైన సందేశాన్ని వినిపించారు. పర్యావరణ పరిరక్షణకు ఆ దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలన్నారు. ఏఖపక్ష చర్యలు తీసుకుంటే వాతావరణ మార్పులపై పోరులో ఆర్థిక అడ్డంకులు ఎదురవుతాయన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్నారు. అప్పుడే శుద్ధ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రజల అవసరాలు తీర్చగలవన్నారు.

Prime Minister ramps up heat, says climate change not of our making

శిలాజ ఇంధనాల ఆధారంగా సంపన్నవంతమై బలపడిన అభివృద్ధి చెందిన దేశాలు.. కర్బన ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి నెట్టితే అది నైతికంగా తప్పవుతుందన్నారు.

కర్బన ఉద్గారాలను తగ్గించడానికి చేస్తున్న సమష్టి కృషిలో అనుసరించాల్సింది ఉమ్మడి సూత్రమే అయినప్పటికీ బాధ్యతల్లో తేడాలు ఉండాల్సిందేనని ప్రధాని మోడీ అన్నారు. లేకుంటే అది నైతికంగా తప్పు అవుతుందని ఆయన సోమవారం నాటి ఫైనాన్షియల్ టైమ్స్ ఒపీనియన్ సెక్షన్‌లో రాశారు.

వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా సాగుతున్న పోరులో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని ప్రధాని మోడీ డిమాండ్ చేశారు. వాతావరణ మార్పుపై సిఓపి21 సదస్సు సోమవారం ఇక్కడ ప్రారంభమైన రోజే కాకతాళీయంగా బ్రిటన్‌లోని ప్రముఖ ఫైనాన్షియల్ దినపత్రికలో ఈ వ్యాసం ప్రచురితమయింది.

English summary
In a sharp message to developed nations, Prime Minister Narendra Modi on November 30 underlined that the “lifestyles of a few” must not crowd out opportunities for developing countries and that the burden of reducing carbon emissions should not be shifted to countries like India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X