వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భీమ్’ యాప్ వినియోగదారులకు.. ప్రధాని బంపర్ ఆఫర్

‘భీమ్‌’వినియోగదారులకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఈ యాప్‌ను రిఫ‌ర్ చేసే ప్ర‌తి యూజ‌ర్ అకౌంట్‌కు రూ.10 జ‌మ‌వుతుంద‌న్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నాగ‌పూర్‌: డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ 'భీమ్‌'వినియోగదారులకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఓ బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఓ వినియోగదారుడు మరో వ్యక్తిని ఈ యాప్‌కు యాడ్ చేస్తే, అలా జోడింపబడిన వ్య‌క్తి మూడు లావాదేవీలు నిర్వహిస్తే.. జోడించిన వినియోగదారుడి అకౌంట్‌కు రూ.10 జ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు.

ఈ ఆఫ‌ర్ అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్రధాని ప్ర‌క‌టించారు. బీఆర్ అంబేద్క‌ర్ 126వ జ‌యంతి సంద‌ర్భంగా శుక్రవారం నాగ‌పూర్‌లో ఆయ‌న డిజిట‌ల్ పేమెంట్స్ కోసం కొత్త‌గా భీమ్‌-ఆధార్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుక‌బ‌డిన‌వారిని పైకి తీసుకురావ‌డ‌మే డిజిట‌ల్ ఇండియా ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టంచేశారు. బీఆర్ అంబేద్క‌ర్ ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము వాటిని అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం. డిజిధ‌న్ పేద‌ల‌ను శ‌క్తివంతుల‌ను చేస్తుంది. ఇది అవినీతికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న స్వ‌చ్ఛ‌మిష‌న్ అని మోడీ అన్నారు.

Prime Minister's Bumper Offer for BHIM app users

భీమ్ యాప్‌ను రిఫ‌ర్ చేసే ప్ర‌తి యూజ‌ర్ అకౌంట్‌కు రూ.10 జ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. అంత‌కుముందు అంబేద్క‌ర్‌ విగ్ర‌హానికి మోడీ నివాళుల‌ర్పించారు. 1956, అక్టోబ‌ర్ 14న అంబేద్క‌ర్‌తోపాటు ఆయ‌న ఆరు ల‌క్ష‌ల మంది అనుచ‌రులు బుద్ధిజాన్ని స్వీక‌రించిన దీక్షాభూమిని కూడా ప్ర‌ధాని సంద‌ర్శించారు.

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఇంత మంది ఒకేసారి మ‌తం మారిన ఘ‌ట‌న మ‌రొక‌టి లేదు. దీక్షాభూమికి ప్ర‌ధానితోపాటు కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలె, మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వెళ్లారు. అక్క‌డున్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి కూడా మోడీ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

English summary
New Delhi: The BHIM-Aadhaar platform for merchants to facilitate digital payments as well as the cashback and referral bonus schemes for the BHIM app will be launched by Prime Minister Narendra Modi at Nagpur on Friday. “This will enable every Indian citizen to pay digitally using their biometric data like their thumb imprint on a merchants’ biometric enabled device which could be smartphone having a biometric reader,” an official statement said.These announcements will be made by Mr Modi at a function on the occasion of 126th birth anniversary of Dr Bhim Rao Ambedkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X