• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చచ్చిపోదామనుకున్నా..ఆ కుటుంబంలో ఎన్నో అవమానాలు: మేఘన్ మార్కెల్ సంచలన వ్యాఖ్యలు

|

బ్రిటన్ రాజకుటుంబంలో తాను ఎన్నో అవమానాలకు గురైనట్లు చెప్పారు ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెట్. రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన వీరు తొలిసారిగా ప్రముఖ టీవీ షో హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ఆదివారం టెలికాస్ట్ అయ్యింది. ఇందులో బ్రిటన్ రాజకుటుంబంపై మేఘన్ మార్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దక్కాల్సిన గౌరవం దక్కలేదు

దక్కాల్సిన గౌరవం దక్కలేదు

ఎంతో ఇష్టపడి 2018లో ప్రిన్స్ హ్యారీని ప్రేమ వివాహం చేసుకుని ఎన్నో ఆశల మధ్య బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన తనకు దక్కాల్సిన గౌరవం దక్కగపోగా.... నిత్యం వేదనలు, అవమానాలే ఎదురయ్యాయని మేఘన్ చెబుతూ భావోద్వేగానికి గురైంది. తాను ఆర్థికంగా చితికిపోయానని ఆదుకోవాల్సిందిగా మేఘన్ రాజకుటుంబ పెద్దలను అడుగగా వారెవరు ఆదుకునేందుకు ముందుకు రాలేదని మేఘన్ గుర్తు చేసుకుంది. అంతేకాదు సహకారం అందించలేమని తేల్చి చెప్పి అది రాజకుటుంబానికి అవమానకరం అని చెప్పినట్లు మేఘన్ వెల్లడించింది. ఇక తన జీవితంలో ఏమి మిగలలేదని భావించి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు చెప్పి షాక్‌కు గురిచేసింది మేఘన్ .

నా కొడుకు నల్లగా పుడితే...

నా కొడుకు నల్లగా పుడితే...

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీపై పలు సంచలన ఆరోపణలు చేసింది మేఘన్ మార్కెల్. మార్కెల్ ఆఫ్రికన్ అమెరికన్. అయితే తాను గర్భవతిగా ఉన్న సమయంలో కొడుకు నల్లగా పుడితే పరిస్థితేంటని తన భర్త ప్రిన్స్ హ్యారీ తనతో చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ఒకవేళ బిడ్డ నల్లగా పుడితే తనకు ఆస్తిలో హక్కుగా రావాల్సిన వాటా రాదని హ్యారీ చెప్పినట్లు మేఘన్ వెల్లడించింది. ఇక ఓఫ్రా విన్‌ఫ్రేతో ఇంటర్వ్యూ సందర్భంగా త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు మార్కెల్ వెల్లడించింది. ఈ సారి ఆడపిల్ల పుట్టబోతోందంటూ సీక్రెట్ రివీల్ చేసేసింది.

నాపై పత్రికలు విషం చిమ్మాయి

నాపై పత్రికలు విషం చిమ్మాయి

ఇదిలా ఉంటే తనరాకతో రాజకుటుంబం చాలా ఇబ్బందుల్లో పడుతోందంటూ పలు పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయని.. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పింది మేఘన్. అయితే అదంతా అవాస్తవమని .... తననే రాజకుటుంబం చాలా ఇబ్బందులకు గురిచేసిందని ఇదే వాస్తవమని చెప్పుకొచ్చింది. కేట్‌ను తాను చాలా ఇబ్బంది పెట్టినట్లు జరిగిన ప్రచారంలో కూడా నిజంలేదని తానే తనను చాలా బాధపెట్టిందని మేఘన్ వెల్లడించింది. తన పెళ్లికి ఐదు రోజుల ముందు ఓ డ్రెస్ విషయమై తనను కేట్ చాలా బాధపెట్టిందని గుర్తు చేసుకుంది. ఆ డ్రెస్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మేఘన్... కేట్ తన క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడిందని పేర్కొంది.

రాజకుటుంబ సభ్యులను కాపాడేందుకు నాపై నిందలు

రాజకుటుంబ సభ్యులను కాపాడేందుకు నాపై నిందలు

ఇక అప్పుడే ఆ కుటుంబంలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కదనే విషయం అర్థమైందని.. అంతేకాకుండా రాజకుటుంబంలోని సభ్యులను కాపాడేందుకు నిందలు తనపై వేసేవారని చెబుతూ కన్నీటి పర్యంతమైంది మార్కెల్. ఇక ప్రిన్స్ హ్యారీ కూడా తన వెర్షన్ ఈ ఇంటర్వ్యూలో వినిపించారు. విలాసవంతమైన జీవితం అనే వలలో తాను చిక్కుకున్నట్లు గ్రహించినట్లు వెల్లడించారు. ఇక వివాహం తర్వాత తనకు ఆర్థిక ఫలాలు దక్కకుండా కోత విధించారని చెప్పుకొచ్చారు. ఇక తన భార్య అయిన మేఘన్‌కు దక్కాల్సిన గౌరవం తన కుటుంబ సభ్యుల నుంచి దక్కలేదని గుర్తు చేసుకున్నారు. నిత్యం తన భార్య మేఘన్ పై పత్రికల ద్వారా రాజకుటుంబ సభ్యులు విషం చిమ్మేవారని చెబుతూ బాధపడ్డారు ప్రిన్స్ హ్యారీ. ఇక ఈ జంట 2018లో వివాహం చేసుకోగా 2019 మే 6వ తేదీన మగబిడ్డకు మేఘన్ జన్మనిచ్చింది.

English summary
Meghan Markle revealed in a no-holds-barred interview on Sunday that a barrage of negative coverage in the British press had driven her to the point where life no longer seemed worth living.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X