వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'యువరాజుకు హెచ్ఐవి టెస్ట్..'

|
Google Oneindia TeluguNews

లండన్ : సమస్య ఏదైనా సరే దానికి సెలబ్రిటీ టచ్ తోడయితే విషయం సులువుగా జనాల్లోకి వెళ్లడమే కాకుండా.. దానిపై ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశముంటుంది. అయితే సెలబ్రిటీగా తమ పలుకుబడిని జనచైతన్యం కోసం ఉపయోగించేవారు మాత్రం కొందరే ఉంటారు. ఆ కొందరిలో వేల్స్ యువరాజు హ్యారీ టాప్ లో ఉంటాడంటున్నారు అక్కడి జనం.

ఎయిడ్స్ పట్ల అప్రమత్తతో వ్యవహరించాల్సిన విషయాన్ని గుర్తుచేస్తూ.. హెచ్ఐవీ టెస్టులపై అవగాహన కల్పించేందుకు తానే రంగంలోకి దిగారు వేల్స్ యువరాజు హ్యారీ. ప్రస్తుతం ఆయన హెచ్ఐవీ టెస్టు చేయించుకున్న వీడియో అక్కడి సోషల్ మీడియాలో అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది. అక్కడి ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్న హ్యారీ, దాన్ని వీడియో తీయించుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎయిడ్స్ పట్ల అవగాహన తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చిన హ్యారీ.. తన ద్వారానే ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. ఇంకేముంది స్థానిక జెయింట్ థామస్ ఆసుపత్రికి వెళ్లి హెచ్ఐవి పరీక్షలు చేయించేసుకున్నాడు. టెస్టులు చేయించుకున్న వీడియోతో పాటు, వచ్చే బుధవారం డర్బన్ లో జరగనున్న అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సుకు తాను హాజరవనున్నట్టు ఓ ట్వీట్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అలాగే హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవడం చాలా సులువైన పని అని తన ట్వీట్ లో పేర్కొన్న హ్యారీ హెచ్ ఐవి పరీక్షలకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా హెచ్ఐవి పరీక్షల్లో హ్యారీకి నెగెటివ్ అని తేలింది.

English summary
The prince walked into a sexual health clinic in Burrell Street, central London, to have the finger-prick test - for which he tested negative.The 31-year-old has made raising awareness about HIV and Aids a major element of his public work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X