• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రిటన్‌ రాణి భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత- 99 ఏళ్ల ప్రాయంలో- ఆయన ప్రత్యేకతలివే...

|

అగ్రరాజ్యం బ్రిటన్‌ను తన కన్ను సన్నలతో శాసించే రాణి ఎలిజబెత్‌ భర్త, డ్యూక్ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌గా పేరొందిన ప్రిన్స్‌ ఫిలిప్‌ ఇవాళ కన్నుమూశారు. బ్రిటన్‌ నేవీలో కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఫిలిప్‌.. రాణితో వివాహం తర్వాత 80 ఏళ్లుగా ఆమెతో కలిసి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఉంటున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ప్రిన్స్‌ ఫిలిప్‌.. తన భార్యతో కలిసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. జూన్‌తో వందేళ్లు పూర్తి చేసుకుంటారని భావించినా విధి మాత్రం ఆయన్ను రెండు నెలల ముందే కబళించింది.

  #PrincePhilip కన్నుమూత, 80 ఏళ్లుగా బ్రిటన్‌ రాణి Queen Elizabeth II తో కలిసే | #DukeofEdinburgh

  బ్రిటన్‌ రాణి భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ ఇకలేరు

  బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్ II భర్త, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్ బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌ ఇవాళ కన్నుమూశారు. తన భర్త మరణాన్ని స్వయంగా రాణిక్వీన్‌ ఎలిజబెత్‌ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ ద్వారా ఓ ప్రకటనలో వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో ప్రిన్స్‌ పిలిప్‌ కన్నుమూసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 99 ఏళ్ల ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణంతో బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌తో పాటు బ్రిటన్‌ దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 80 ఏళ్లుగా బ్రిటన్‌ రాణితో కలిసే ఉన్న ప్రిన్స్‌ ఫిలిప్‌ వృద్ధాప్యం కారణంగా 2017లో రాజకుటుంబ విధులకు దూరమయ్యారు. అప్పటి నుంచి ఆయన విశ్రాంతిలోనే ఉంటున్నారు. జూన్‌లో 100వ పుట్టినరోజు జరుపుకుంటారని భావించినా ప్రిన్స్‌ ఫిలిప్‌ తుదిశ్వాస విడవటం రాజకుటుంబంలో విషాదాన్ని నింపింది. గతేడాది నవంబర్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, ప్రిన్స్‌ ఫిలిప్‌ వివాహ వార్షికోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. జనవరిలో వీరిద్దరూ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.

   బ్రిటన్‌ రాణి జీవితంలో భాగంగా

  బ్రిటన్‌ రాణి జీవితంలో భాగంగా

  మాజీ నేవీ కమాండర్‌ అయిన ప్రిన్స్‌ ఫిలిప్‌.. తన జీవితంలో అత్యధిక భాగాన్ని భార్య ఎలిజబెత్‌తో కలిసి సామాజిక కార్యకలాపాలకే వెచ్చించారు. వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా రాణి జీవితంలో మాత్రం ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను తన బలంగా అభివర్ణించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్పత్రిలో చేర్చించారు. నెల రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్‌ అయి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. చివరికి ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

   బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌తో ప్రయాణం

  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌తో ప్రయాణం

  1939లో బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తూ కాబోయే రాణి అయిన ఎలిజబెత్‌కు పరిచయం అయిన ప్రిన్స్‌ ఫిలిప్‌ 1947లో ఆమెను వివాహం చేసుకున్నారు. 1952లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్‌ బాద్యతలు స్వీకరించే నాటికి ప్రిన్స్‌ ఫిలిప్‌ నేవీలో కమాండర్‌ హోదాలో ఉన్నారు. పెళ్లి తర్వాత బ్రిటన్‌ రాణికి సహకరిస్తూ నేవీలో బాద్యతల నుంచి ఆయన వైదొలిగారు. ఆ తర్వాత కూడా దశాబ్దాలుగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో ఈ దంపతులు పాలుపంచుకున్నారు.

   ప్రిన్స్‌ ఫిలిప్‌ వ్యక్తిగత జీవితం

  ప్రిన్స్‌ ఫిలిప్‌ వ్యక్తిగత జీవితం

  తన ఆరోగ్యం విషయంలో ప్రిన్స్‌ ఫిలిప్‌ ఎక్కువగా గోప్యత పాటించేవారు కాదు. 2011లో తొలిసారి గుండెకు స్టెంట్‌ వేయించుకున్న ఫిలిప్‌.. 2018లో నడుము కింద భాగంగా మరో ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. 2019లో ఆయన వాహనం గుద్దుకుని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కరోనా తర్వాత ప్రజలకు ఆయన ఎక్కువగా కనిపించలేదు. గతేడాది జూలైలో విండ్సర్‌ కాజిల్‌లో జరిగిన మిలిటరీ సెరెమనీలో మాత్రం పాల్గొన్నారు. రాణి ఎలిజబెత్‌, ఫిలిప్‌ దంపతులకు నలుగురు పిల్లలు ఛార్లెస్‌, అన్నే, ఆండ్రూ, ఎడ్వర్డ్‌. కాగా ఎనిమిది మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

  English summary
  "It is with deep sorrow that Her Majesty The Queen announces the death of her beloved husband, His Royal Highness The Prince Philip, Duke of Edinburgh," it said in a statement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X