ఇండియన్‌ను, ఏం మీరు ట్రంప్‌కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా ధీటైన జవాబు
ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ గెలుపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, ఇతర దేశస్థులకు భయాందోళన కలిగిస్తుంటే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం ఏమాత్రం భయపడటం లేదట.
లాస్ ఏంజిల్స్: ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ గెలుపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, ఇతర దేశస్థులకు భయాందోళన కలిగిస్తుంటే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం ఏమాత్రం భయపడటం లేదట.
లాగొద్దు: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా సంపన్నుడి హెచ్చరిక
ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ప్రియాంక చోప్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను ట్రంప్ గురించి ప్రశ్నించింది.
ఆమె అవార్డు అందుకోగానే ఓ విలేకరి... 'అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏమిటి, మీరు భయపడుతున్నారా' అని అడిగారు.
దానికి ప్రియాంక చోప్రా ధీటుగా స్పందించింది. నేను భారతీయురాలిని. ఏం మీరు భయపడుతున్నారా అని విలేకరిని ఎదురు ప్రశ్నించింది.
దానికి సదరు విలేకరి స్పందిస్తూ.. 'లేదు (నేను భయపడట్లేదు), కానీ చాలామంది విదేశీయులు భయపడుతున్నారు' అని చెప్పారు.