వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలైన ప్రొఫెసర్....క్లాసులో విద్యార్థిని బిడ్డకు తల్లిగా మారిన వైనం....! సోషల్ మీడియాలో వైరల్...

|
Google Oneindia TeluguNews

ప్రొఫెసర్లలో కొందరు ప్రోఫెసర్లు వేరయా... ఎందుకంటే, కొంతమంది తమకోసం ఉద్యోగం చేస్తే మరికొంతమంది సమాజం కోసం చేస్తారు.. ఇంకొద్ది మాత్రం దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యార్థులు, చదువంటే ప్రాణం ఇచ్చే వారి కోసం ఉద్యోగాలు చేస్తారు. తమ ఉద్యోగ జీవితంలో కూడ అలాగే వ్యవహరిస్తారు.. క్లాస్‌లోని విద్యార్థినికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు. క్లాసు లోపల కాకుండా క్లాసు బయట కూడ వారి బాగోగులను చూసుకునే నైజం ఆ ప్రోఫెసర్లలో ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని జార్జియా గ్వినెట్ కాలేజీలో ప్రోఫెసర్‌గా పని చేస్తున్న రమాటా సిస్సే కూడ ఇలాగే వ్యవహరించింది. కాలేజిలో చదువుకోవాలనే తాపత్రయం ఉన్న విద్యార్థులకు పిల్లలు ఉన్నా.. చదువును కొనసాగిస్తూ మంచి విద్యార్థితోపాటు మంచి తల్లిగా కూడ ఎదగాలనే సంకేతాలను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తన క్లాస్‌కి కన్నబిడ్డతో వచ్చిన విద్యార్ధినికి తన సహకారం అందించి ప్రపంచవ్వాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

professor holds baby while teaching in the class

ఓ రోజు ప్రొఫెసర్ అనుమతితోనే తన చంటిబిడ్డను తీసుకుని ఓ విద్యార్థిని కాలేజీకి చేరింది. కాని అక్కడ బాబును చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో ఆ విద్యార్థిని ఇబ్బందిపాలైంది. దీంతో ఆ విద్యార్థిని క్లాసు వినేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రొఫెసర్ సిస్సే చిన్నపిల్లాడిని తీసుకుని నడుముకు కట్టుకుంది. అలా పిల్లాడితోనే మూడు గంటలపాటు క్లాసులో లెక్చర్ ఇచ్చారు. ఇక ఆ సమయంలో తీసిన ఓ ఫోటోను సిస్సో కూతురు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె లాంటి తల్లి ప్రపంచానికి అవసరమని కామేంట్ చేశారు. ఇలా లక్షవరకు ఆ ఫోటోలకు లైక్‌లు కొట్టిన పరిస్థితి నెలకొంది.

అయితే పిల్లవాడిని తీసుకువచ్చిన విద్యార్థినికి చదువుపై చాల శ్రద్ద కనబర్చడంతోపాటు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రోఫెసర్ విస్సే చెప్పారు. వాళ్ల గ్రామంలో ప్రయాణంలో పిల్లలను సురక్షితంగా ఉంచడం ఇలా చేస్తారని వివరించారు.

English summary
A college professor's kind-hearted gesture has won her thousands of fans across the world. professor as acted like babysitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X