వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మన్ వింగ్స్: ఆత్మహత్యపై నెట్లో వెతికిన కోపైలట్, ప్లేన్ డోర్ల గురించి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఆల్ఫ్స్ పర్వతాల్లో ఎయిర్ బస్ ఏ 320 విమానం కూల్చాడనే అనుమానాలు బలపడేలా కో పైలట్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కో పైలట్ ఆండ్రియాస్ ల్యూబిడ్జ్ విమానం కూలడానికి కొద్దిరోజుల ముందు నుండే ఆత్మహత్య ఎలా చేసుకోవాలి, విమానంలోని కాక్ పిట్ డోర్లు ఎలా ఉంటాయి, దాని భద్రత వ్యవస్థ ఎలా ఉంటుంది అనే అంశాలపై ఇంటర్నెట్లో తీవ్రంగా వెతికినట్లు గురువారం వెలుగు చూసింది.

'Prosecutors: Lubitz probed suicide methods, cockpit security

ల్యూబిడ్జ్ నివాసం నుండి స్వాధీనం చేసుకున్న ట్యాబ్ కంప్యూటర్ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యూబిడ్జ్ లోరాజపమ్ అనే బలమైన యాంటీ యాక్జైటీ డ్రగ్‌ను వాడాల్సిందిగా డాక్టర్లు సూచించారట. ఈ డ్రగ్ తీసుకుంటే ఏ వాహనాన్ని నడపవద్దు. కనీసం సైకిల్ కూడా నడపరాదని సమాచారం.

ఈ డ్రగ్ వాడే కొత్తలో మానసిక రోగుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తీవ్రమవుతుందని, రానురాను తగ్గుతుందని, డ్రగ్ వాడే వారు కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవాలని తెలుస్తోంది. ఈ డ్రగ్ వాడమని ల్యూబిడ్జ్‌కు చెప్పిన వైద్యులు.. కొంతకాలం సెలవు తీసుకోమని సూచించారు. అయితే, తాను సెలవులలో ఉన్నట్లు ల్యూబిడ్జ్ వైద్యులతో అబద్దం చెప్పేవాడట.

English summary
Lubitz probed suicide methods, cockpit security
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X