నాకు డబ్బు, వారికి పౌరసత్వం: సీరియల్ పెళ్లి కూతురి మాట

న్యూయార్క్: తన వరుస పెళ్లిళ్లపై లియానా క్రిస్టినా బారియంటోస్ అనే మహిళ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఆ యువతి పది పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. డబ్బుల కోసం తాను పెళ్లి చేసుకున్నానని, ప్రతిగా వారికి పౌరసత్వం లభించిందని ఆమె అంగీకరించినట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం బ్రోంక్స్ కోర్టురూమ్‌కు చెప్పారు.

కొంత మంది వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని, కొంత మంది పౌరసత్వం రాకపోవడంతో ఆమెతో విడాకులు తీసుకుని వేరే భార్యలను వెతుక్కున్నారని ప్రాసిక్యూటర్స్ చెప్పారు.

అమెరికాకు ఉగ్రవాద హెచ్చరికలు చేయడంతో పాకిస్తాన్‌కు చెందిన ఓ భర్తను వెనక్కి పంపించిట్లు, ఆమె అతనితో విడాకులు తీసుకోలేదని, మరో ముగ్గురితో కూడా విడాకులు తీసుకోలేదని అన్నారు. తాను తప్పు చేయలేదని ఆమె కోర్టుకు చెప్పింది.

Prosecutors Say Serial Bride Admitted Marrying For Cash

ఆమెకు యువకులను మోసం చేసి పెళ్లి చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకే ఆమె సుమారు పదేళ్ల కాలంలో పదిమందికి పైగా యువకులను పెళ్లి చేసుకుంటూ జల్సాలు చేసింది. వివాహం జీవితంలో భర్తతో వివాదాలు చోటు చేసుకుంటే అతడ్ని విడిచిపెట్టి మరో వ్యక్తిని ఆమె పెళ్లాడేది. ఆమె వయస్సు ఇప్పుడు 39ఏళ్లు.

ఆమె అంటే లియానా క్రిస్టినా బారియంటోస్ 2002, వాలెంటైన్స్ రోజున లాంగ్ ఐస్లాండ్‌లో ఓ యువకుడితో వివాహం చేసుకుంది. ఆ తర్వాత 15 రోజులకే అతనితో విడిపోయి మరో వ్యక్తితో వివాహం చేసుకుంది. మరో 13 రోజుల్లోనే ఆమె మరో ఇద్దరు యువకులను పెళ్లాడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+