వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందాల సింగపూర్‌కు డేంజర్ బెల్స్.. పెరుగుతున్న సముద్ర మట్టం ...

|
Google Oneindia TeluguNews

సింగపూర్ : కాలుష్యం, కాలుష్య కారక ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. దీంతోపాటు సముద్రమట్టం కూడా పెరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే జనం బెంబేలెత్తిపోతున్నారు. పల్లపుప్రాంత ద్వీపం సింగపూర్ సముద్రమట్టం కూడా పెరుగుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలుష్య ఉద్గారాలను తగ్గిద్దామని ఆదివారం సింగపూర్ పౌరులు ర్యాలీ కూడా తీశారు. సింగపూర్‌లో సముద్ర మట్టం పెరిగేందుకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అని అంగీకరించారు ఆ దేశ ప్రధాన మంత్రి లీ సిన్ లుంగ్.

పెరుగుతున్న సముద్రమట్టం ..

పెరుగుతున్న సముద్రమట్టం ..

గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాలుష్యం, కాలుష్యకారక ఉద్గారాలతో సముద్రమట్టం యధేచ్చగా పెరుగుతూ .. మానవాళి జీవన మనుగడపై ప్రభావం చూపుతుందన్నారు. ఒకవేళ సముద్రమట్టం పెరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం 72 అమెరికా బిలియన్ డాలర్ల వ్యయమవుతుందని లెక్కగట్టారు. దీంతో మరో వందేళ్ల వరకు మాత్రమే కాలుష్య ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్‌ను ఎంతో కొంత తగ్గించొచ్చని చెప్పారు. భవిష్యత్‌లో బిల్డింగ్‌లకు పోల్డర్లు నిర్మించడం, భూభాగాన్ని బ్యారేజ్‌లతో అనుసంబంధానించడం వల్ల ప్రమాదముప్పును కాస్త తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు.

 కార్బన్ టాక్స్

కార్బన్ టాక్స్

కాలుష్య కారకాలపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు వివరించారు లీ. కాలుష్య కారకాలపై కార్బన్ టాక్స్ వసూల్ చేస్తున్నట్టు వివరించారు. ఇలాగే ఉంటే భవిష్యత్‌లో మౌలిక వసతుల కల్పన మరింత హీనస్థితికి చేరుతుందని పేర్కొన్నారు. అందుకోసమే ఎయిర్ పోర్టు టెర్మినళ్లను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని మలినాల కోసం రెండేళ్లకు 400 మిలియన్ సింగపూర్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతోపాటు సింగపూర్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్‌మెంట్ వయస్సును తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు 65 ఏళ్లు ఉందని .. అది 2022 వరకు 63కు చేరుకుంటుందని చెప్పారు. 2030 నాటికి 62 నుంచి 65 మధ్యలో ఉంటుందని వివరించారు.

ముందుకు పదవీ విరమణ

ముందుకు పదవీ విరమణ

పదవీ విరమణపై లీ స్పందిస్తూ .. 'దీర్ఘకాలంలో కూడా సింగపూర్ ఉద్యోగులు ఆరోగ్యంగానే ఉంటారు. కానీ వారి సేవలను మేం తీసుకోదగలచలేమని స్పష్టంచేశారు. అంతేకాదు ఓ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత తన పొదుపు మొత్తంతో సుఖంగా బతుకుతారని పేర్కొన్నారు. అయితే సింగపూర్‌లో కొందరు 67 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు తమ ఉపాధి కల్పించమని కోరుతున్న నేపథ్యంలో .. ప్రధాని లీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్ ఉద్యోగులు ఉపాధి కోసం చూస్తుండగా .. కాలుష్య కారక వ్యర్థాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి కారణం గతేడాది దేశ వృద్ధి తగ్గిందని గుర్తుచేశారు. దీంతోపాటు గ్లోబల్ వార్మింగ్ డేంజల్ బెల్స్ మోగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల పదవీ విరమణ వయస్సుపై సింగపూర్ ప్రధాని లీ కఠిన వైఖరి తీసుకుంటామని స్పష్టంచేశారు.

English summary
protecting Singapore against rising sea levels could cost S$100 billion ($72 billion) or more over 100 years, its prime minister said on Sunday, as the low-lying island-state makes preparations to mitigate the impact of global warming. "How much will it cost to protect ourselves against rising sea levels? My guess is probably S$100 billion over 100 years, quite possibly more," Prime Minister Lee Hsien Loong said. Lee said Singapore's future options include building polders, areas of land reclaimed from a body of water, or reclaiming a series of islands offshore and connecting them with barrages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X