వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు, ఉక్రెయిన్ విమానం తామే కూల్చమనే ప్రకటనపై ఆందోళనలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్ మిలిటరీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఆదివారం ప్రజలు ఆందోళన పీక్‌కి చేరింది. వాస్తవానికి విమానాన్ని అమెరికా క్షిపణుల ద్వారా కూల్చివేసిందని భావించారు. కానీ శత్రుదేశ విమానంగా భావించి కూల్చివేశామని ఇరాన్ మిలిటరీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెహ్రాన్‌లోని యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టిన ఆందోళనకారులు..తమ శత్రువు అమెరికా అని పాలకులు అబద్ధాలు చెప్తున్నారు. కానీ శత్రువు ఇక్కడే ఉన్నారు అని మండిపడ్డారు. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో కూడా నిరసనకారులు ఆందోళనకు దిగారు.

Protests erupt again in Iran after military admits it hit plane

ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదంలో 176 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తొలుత అమెరికా లేదా కెనడా క్షిపణి ప్రయోగం జరిపారని ఇండికేషన్స్ ఇచ్చి.. తర్వాత తామే పొరపాటున క్షిపణి ప్రయోగం చేశామని ఇరాన్ మిలిటరీ తప్పును అంగీకరించింది.

Recommended Video

180 మందీ దుర్మరణం: ఉక్రెయిన్ విమాన ప్రమాద వీడియో..!

విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ మిలిటరీ శనివారం ప్రకటించిన కొద్దిసేపటికే టెహ్రాన్‌లో వేలాదిమంది ఆందోళన చేపట్టారు. నియంతకు మరణం అని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నేత అయతుల్లా అలీ ఖమేనీని కొట్ చేశారు. ఇరాన్ స్థానిక పత్రిక ఎటెమాడ్ ఖమేని క్షమాపణ చెప్పడం కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
protesters piled pressure on Iran's leadership on Sunday with demands for top authorities to quit after the Iranian military admitted it had mistakenly shot down a Ukrainian airliner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X