పుతిన్‌కు ఝలక్.. సలహాదారు రాజీనామా..! అసలు కారణం అదే ?
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రపంచ దేశాలతో పాటు సొంత దేశంలోనూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు సెగలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పుతిన్‌కు మరో షాక్ తగిలింది. పుతిన్ సలహాదారు అనతోలి చుబైస్ తన పదవికి రాజీనామా చేసి చేసి ఝలక్ ఇచ్చారు. అంతర్జాతీయ సంబంధాలపై పుతిన్‌కు సలహాదారునిగా ఆయన పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అనతోలి చుబైస్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా విషయాన్ని రష్యా అధికారులు కూడా ధ్రువీకరంచారు. ఉక్రెయిన్‌పై దాడులను నిరసిస్తూ రాజీనామా చేసిన.. రష్యాకు చెందిన రెండో అత్యున్నత అధికారి చుబైస్.

పుతిన్ సలహాదారు రాజీనామా !
రష్యా పర్యావరణ దౌత్యవేత్తగా, అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్‌కు సలహాదారుగా అనతోలి చుబైస్ పని చేస్తున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా అధికార ప్రతినిథి దిమిత్రి ధృవీకరించారు. కానీ అనతోలి చుబైస్ ప్రభుత్వ కార్యకలాపాల్లో పెద్దగా ప్రభావంతమైన వ్యక్తి కాదని రష్యా వర్గాలు పేర్కొంటున్నారు. అంతే కాకుండా భద్రతా వ్యవహారాల్లో కూడా ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. అయితే పుతిన్‌కు సలహాదారుగా ఉన్న చుబైస్ రాజీనామా చేయడం తీవర చర్చనీయాంశమైంది.

ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర
సోవియట్ విచ్ఛన్నం తర్వాత రష్యా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్రపోషించిన వ్యక్తుల్లో అనతోలి చుబైస్ ఒకరు. దేశంలో ప్రైవేటీకరణలకు రూపశిల్పిగా ఆయనకు పేరు ఉంది. అప్పటి నుంచి వ్లాదిమిన్ పుతిన్‌కు చుబైస్ మద్దతుగా నిలచారు. ఆయనకు సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం చుబైస్కు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. దురాక్రమణకు దిగిన నాటి నుంచి పుతిన్ ప్రభుత్వానికి కాస్త దూరంగానే ఉనట్లు సమాచారం. తాజాగా తన సహచరులకు , స్నేహితులకు రాసిన లేఖలో తన రాజీనామా గురించి ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

మరియుపోల్‌లో దాడులు తీవ్రతరం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించి దాదాపు నెలరోజు కావోస్తోంది. అయినా పూర్తిస్థాయిలో పట్టుసాధించలేకపోయింది. దీంతో కీవ్, మరియుపోల్, ఉర్కీవ్ వంటి నగరాల్లో దాడులను మురింత తీవ్రతరం చేసింది. రష్యా దళాల క్షిపణులు, బాంబు దాడులతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. లక్షలాది మంది భయంతో దేశం విడిచి పొరుగు దేశాలకు పారిపోతున్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచదేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భీకర దాడులతో మాస్కో బలగాలు విరుచుకుపడుతున్నాయి. అటు శాంతి చర్చలు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్ఫష్టం చేశారు.