వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై పుతిన్ - ట్రంప్ ఫోన్ సంభాషణ .. వైద్య పరికరాలతో యూఎస్ లో అడుగుపెట్టిన రష్యన్ విమానం

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుంది . మరణమృదంగం మోగిస్తుంది . ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 47, 192 కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 9,35,197 పాజిటివ్‌ కేసుల సంఖ్య కి చేరుకుంది. ఇక దేశాలకు దేశాలే కరోనాకు వణుకుతున్న పరిస్థితి. అగ్ర దేశమైన అమెరికా సైతం కరోనా మహమ్మారి విషయంలో గడగడలాడుతున్న పరిస్థితి. రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఊహించని విపత్తు .. కరోనా , లాక్ డౌన్ గుర్తుగా పిల్లలకు పేర్లు పెట్టేస్తున్న ప్రజలుఊహించని విపత్తు .. కరోనా , లాక్ డౌన్ గుర్తుగా పిల్లలకు పేర్లు పెట్టేస్తున్న ప్రజలు

 అమెరికాలో 2, 13 , 003 కేసులు.. 5 వేలకు పైగా మృతులు

అమెరికాలో 2, 13 , 003 కేసులు.. 5 వేలకు పైగా మృతులు

ఇక అమెరికాలో 2, 13 , 003 కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మృత్యు వాత పడ్డారు. ఇక భారీగా నమోదవుతున్న కేసుల నేపధ్యంలో వైద్య పరికరాల కొరత ఏర్పడింది. దీంతో ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సంప్రదింపులు జరిపారు. కరోనావైరస్ బాధితులకు కావలసిన మెడికల్ కిట్లు , పరికరాలతో రష్యా విమానం యుఎస్‌లో అడుగుపెట్టింది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంక్షోభం గురించి చర్చించిన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి తన సహకారం అందిస్తున్నారు .

కరోనా ఫైట్ .. అమెరికాకు వైద్య పరికరాలను పంపిన రష్యా ..

కరోనా ఫైట్ .. అమెరికాకు వైద్య పరికరాలను పంపిన రష్యా ..

రష్యా అమెరికాకు వైద్య పరికరాలను పంపింది. వెంటిలేటర్లు మరియు వ్యక్తిగత రక్షణ పరికరాల కొరతను తీర్చడానికి కష్టపడుతున్న ట్రంప్, సోమవారం ఫోన్ కాల్‌లో పుతిన్ తో మాట్లాడారు. వైద్య పరికరాలజు సమకూర్చాలని కోరారు. దీంతో పుతిన్ కరోనా పై జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు సహకారం అందించటానికి అంగీకరించారు.ఇక మరో వైపు అమెరికా తమ వారిని స్వదేశానికి తీసుకొచ్చే పనిలో ఉంది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
ఇతర దేశాల్లోని తమ పౌరులను తిరిగి రప్పిస్తున్న అమెరికా

ఇతర దేశాల్లోని తమ పౌరులను తిరిగి రప్పిస్తున్న అమెరికా

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన భారతదేశం నుండి, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని అమెరికా స్వదేశానికి తిరిగి రప్పించడం ప్రారంభించింది. ఇక దీనిపై ఒక సీనియర్ అమెరికన్ దౌత్యవేత్త మాట్లాడుతూ, అమెరికన్లు స్వదేశాలకు చేరటంలో పూర్తిస్థాయిలో సహకరించినందుకుభారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ "ముఖ్యమైన మిషన్" ను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరుల కోసం అమెరికా చేస్తున్న భారీ ప్రయత్నం ఇది . ఇప్పటివరకు, 350 కి పైగా విమానాలలో 60 కి పైగా దేశాల నుండి 30,000 మంది పౌరులను అమెరికా స్వదేశానికి రప్పించింది. ఇంత సంక్షోభంలోనూ అమెరికా తమ పౌరుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది .

English summary
Russia sent the United States medical equipment on Wednesday to help fight the coronavirus pandemic, a public relations coup for Russian President Vladimir Putin after he discussed the crisis with U.S. President Donald Trump. Trump, struggling to fill shortages of ventilators and personal protective equipment, accepted Putin's offer in a phone call on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X