• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్యను ఎలా కొట్టాలంటే!!!

|

భార్యంటే బానిస అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. సౌదీ అరేబియాలో అయితే పరిస్థితి మరీ దారుణం. పెళ్లి కాక ముందు యువతులు తండ్రి పర్మిషన్ లేనిదే కనీసం బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఇక పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టాక ఏ పని చేయాలన్నా భర్త పర్మిషన్ కావాల్సిందే. ఈ మధ్యకాలంలో వారి ఆలోచన విధానంలో కాస్త మార్పు వస్తున్నా.. భార్యను ఎలా కొట్టాలంటే అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది.

పాకిస్తాన్ రిపోర్టర్లా, మజాకా?.. ఆనాడు గాడిద.. ఈనాడు వరద (వీడియో)

భార్యను ఎలా కొట్టాలో తెలుసుకోండి

భార్యను ఎలా కొట్టాలో తెలుసుకోండి

ఖతార్‌కు చెందిన సామాజికవేత్త అల్ అజీజ్ అల్ ఖజారజ్ అల్ అన్సారీ భార్యను ఎలా కొట్టాలో వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లైన మగవారు ఈ వీడియోను తప్పకుండా చూడాలంటూ డెమో ప్రారంభించిన ఆయన.. భార్యల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో భర్తలకు హితబోధ చేశాడు. భార్యను కొట్టడం తప్పనిసరే అయినా ప్రతిరోజు కొట్టకూడదన్న అజీజ్.. తాను ఆడదాన్నని, భర్త బలవంతుడన్న విషయం ఎప్పటికీ గుర్తుండేలా పెళ్లాలను దండించాలని సలహా ఇచ్చాడు. కుటుంబాన్ని ఓ కంపెనీగా భావించాలనిస్తే భర్త దాని యజమాని, భార్య అందులో పనిచేసే వర్కర్ అని భావించాలని అర్థంలేని పోలిక చెప్పాడు. పనివాడు బుద్దిగా మసులుకోకపోతే యజమాని దండించినట్లే భార్యను కొట్టాలని అడ్వైజ్ ఇచ్చాడు. పెళ్లాని ఎలా కొట్టాలో ఓ అబ్బాయి సాయంతో డెమో కూడా చేసి చూపించాడు.

ప్రేమగా ఉంటే క్రమశిక్షణ అలవడదట

ప్రేమగా ఉంటే క్రమశిక్షణ అలవడదట

భార్యను కొడితేనే జీవితం సాఫీగా సాగుతుందని కొత్త భాష్యం చెప్పిన అజీజ్ వారితో ప్రేమగా ఉంటే క్రమశిక్షణ అలవడదన్న కొత్త రహస్యం బయటపెట్టాడు. భార్య క్రమశిక్షణతో మసలకపోతే ముందుగా హెచ్చరించాలని, ఆ తర్వాత సలహా ఇవ్వాలని, అప్పటికీ దారికి రాకపోతే బెడ్‌రూంకు దూరంగా ఉంచాలని సలహా ఇచ్చాడు. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను దండించాలని చెప్పాడు. ముస్లిం మతం ఎంతో జాలి కలిగినదని, అందుకే భార్యను కొట్టే విషయంలో పాటించాల్సిన నియమాలను కూడా చక్కగా వివరించిందని అన్నాడు. ముఖం మీద లాగిపెట్టి కొట్టడం, ముక్కు మీద గుద్దడం, రక్తం వచ్చేలా తలపై కొట్టడం చేయకూడదంటూ సలహాల మీద సలహాలు ఇచ్చాడు.

 ఆరున్నర కోట్ల వ్యూస్

ఆరున్నర కోట్ల వ్యూస్

ఏప్రిల్ 3న పోస్ట్ చేసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 6లక్షల 78వేల మంది చూశారు. భార్యలను ఎలా దండించాలో వివరిస్తున్న ఈ వీడియోపై మహిళా సంఘాలతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. మహిళలపై అరాచకాలను ప్రోత్సహిస్తోందని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
A sociologist from Qatar named Abd Al Aziz Al-Khazraj has received backlash from all over the world after he posted a video on YouTube teaching men how to beat their wives. In the video, he gave demonstration and instruction about how to beat the wife in an Islamic permissible way. The video caused outrage among the netizens and slammed the sociologist for treating women in such a way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X