• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'వుహాన్ ల్యాబ్ లీక్'ను డా.ఫౌసీ కవర్ చేశారా-సంచలనం రేపుతున్న ఈమెయిల్స్-అసలేం జరుగుతోంది...

|

కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది... ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ కచ్చితమైన ఆధారాలు లేవు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీకై ఉండొచ్చునన్న అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో ఈ కుట్ర కోణంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అమెరికాకు చెందిన ఆంటోనీ ఫౌచీ లాంటి అంటువ్యాధుల నిపుణులు అప్పట్లో ఈ కుట్ర కోణాలను కొట్టిపారేశారు. కానీ ఇదే ఆంటోనీ ఫౌచీ ఇప్పుడీ కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.

కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉంటుందన్న అంశాన్ని కొట్టిపారేయలేమని ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. దానికి తోడు డా.ఫౌచీ ఇమ్యునాలజిస్టు అండర్సన్‌కు మధ్య కరోనా వ్యాప్తి తొలినాళ్లలో జరిగిన ఈమెయిల్ సంభాషణ డా.ఫౌచీపై అనుమానాలకు తావిస్తోంది. డా.ఫౌసీకి అండర్సన్ పంపిన ఒక ఈమెయిల్‌లో 'ఈ వైరస్‌కు ఉన్న ఫీచర్లను ల్యాబ్‌లో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మార్చి ఉండొచ్చు.' అని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే డా.ఫౌసీ.. కరోనా వైరస్‌ వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

questions rising over dr.Fauci after emails made public over wuhan lab leak conspiracy

తాజాగా ఇద్దరి మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు బహిర్గతం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై గత వారం అండర్సన్ స్పందిస్తూ... నిజానికి ల్యాబ్ లీక్ అంశాన్ని తాము సీరియస్‌గా పరిశీలించామని... కానీ ఆ తర్వాత జరిపిన సమీక్షలో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. లోతైన విశ్లేషణ,చర్చోపచర్చలు,తగినంత డేటాను పరిశీలించిన తర్వాతే తమ నివేదికను సమర్పించామని చెప్పారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి ఎకో హెల్త్ అలయన్స్ ద్వారా వుహాన్ ల్యాబ్‌కు 2014-2019 వరకు 3.4 మిలియన్ డాలర్లు అందినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18,2020న ఎకో హెల్త్ అలయన్స్ ప్రెసిడెంట్ పీటర్ దస్జక్ డా.ఫౌసీకి పంపిన ఈమెయిల్ కూడా తాజాగా బహిర్గతమైంది. ఈ మెయిల్ మరింత కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అవలేదని... ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందవచ్చునని రిపోర్ట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని అందులో పీటర్ పేర్కొన్నారు. దీన్నిబట్టి డా.ఫౌసీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

  Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu

  మరోవైపు తాజాగా డా.ఫౌసీ మాట్లాడుతూ... కరోనా వ్యాప్తికి ముందు వుహాన్‌ ల్యాబ్‌లో అనారోగ్యానికి గురైన ముగ్గురు సిబ్బంది మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలని వుహాన్ వైరాలజీ ల్యాబ్‌ను డా.ఫౌచీ కోరారు. వారి అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం మీద డా.ఫౌసీ వ్యవహారంపై ఇప్పుడో పెద్ద సందిగ్ధం నెలకొంది. నిజంగానే వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ విషయాన్ని ఆయన కవర్ చేశారా... లేక ఉన్న విషయాన్నే అప్పట్లో నిజాయితీగా రిపోర్ట్ చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  English summary
  That initial email, which was released to the Washington Post and BuzzFeed this week under the Freedom of Information Act, has been seized on by conservative news organizations as a smoking gun, proving that top officials and scientists covered up the origins of the Covid-19 virus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X