వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ కంచు కోటలో అనూహ్య పరిణామం! బరిలోకి రచెల్ క్రూక్స్, రిపబ్లికన్లకు దెబ్బేనా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ లైంగిక వేధింపుల పర్వంపై ఇప్పటి వరకు ఓ డజను మంది నోరు విప్పి ఉంటారు. కానీ అందరికంటే ముందు ఆయనపై ఈ ఆరోపణలు చేసింది మాత్రం రచెల్ క్రూక్స్ అనే మహిళ.

ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...

అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ కంచుకోట అయిన ఓహియో నుంచి స్టేట్ లెజిస్లేచర్ అభ్యర్థిగా ఇప్పుడు ఆమె ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. రచెల్ క్రూక్స్‌ను ఏరికోరి డెమొక్రటిక్ పార్టీ తన అభ్యర్థిగా రంగంలోకి దించుతుండడం సంచలనంగా మారింది.

పోర్న్‌స్టార్ ఎఫెక్ట్: ట్రంప్ సంసారంలో నిప్పులు.. హోటల్‌కు వెళ్లిపోయిన మెలానియా!పోర్న్‌స్టార్ ఎఫెక్ట్: ట్రంప్ సంసారంలో నిప్పులు.. హోటల్‌కు వెళ్లిపోయిన మెలానియా!

ట్రంప్ కంచుకోట రిపబ్లికన్లకు వ్యతిరేకంగా...

ట్రంప్ కంచుకోట రిపబ్లికన్లకు వ్యతిరేకంగా...

అమెరికాలోని ఓహియో స్టేట్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కంచుకోట వంటింది. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతం నుంచే గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీపై 61 శాతం ఓట్లతో విజయం సాధించారు. అధ్యక్షుడు ట్రంప్ లైంగిక వేధింపుల గురించి మొట్టమొదటిసారి ఆరోపణలు చేసిన రచెల్ క్రూక్స్ అనే మహిళను డెమొక్రటిక్ పార్టీ అదే ఓహియో స్టేట్ లెజిస్లేచర్ అభ్యర్థిగా తన తరుపున బరిలోకి దించుతోంది.

అందుకే వస్తున్నా...

అందుకే వస్తున్నా...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిలో తొలి మహిళ రచెల్ క్రూక్స్. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా ట్రంప్ పాలనలో అమెరిక్ల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని ఆరోపిస్తున్నారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అమెరికన్లు కలత చెంది ఉన్నారు. ట్రంప్‌ పాలనలో వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వారి తరపున గొంతుకను వినిపించేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా..' అంటూ ఆమె ఓ ప్రకటన చేశారు.

ట్రంప్‌పై ఇవీ రచెల్ ఆరోపణలు...

ట్రంప్‌పై ఇవీ రచెల్ ఆరోపణలు...


2005లో ట్రంప్ టవర్‌లోని ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీలో రచెల్ క్రూక్స్ రిసెప్షనిస్టుగా పనిచేస్తుండేది. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశాడు. తనంతట తాను పరిచయం చేసుకుని ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆపై బలవంతంగా ఆమె బుగ్గల మీద, తర్వాత పెదాల మీద ముద్దుపెట్టుకున్నాడు. ‘అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది, కానీ, నేనేమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారు..' అని ఆ తరువాత క్రూక్స్ ఓ ఇంటర్వ్యూలో నాటి ఘటనను గుర్తు చేసుకుంది. అంతేకాదు, కొన్నాళ్ల తర్వాత ట్రంప్‌ మళ్లీ ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఫోన్ నెంబరు అడిగారట. ‘ఉద్యోగ రీత్యా ఆయన ఫోన్ నంబర్ అడిగిన వెంటనే నేను ఇవ్వాల్సి వచ్చింది... అయితే థాంక్ గాడ్.. ఆ తర్వాత ఎలాంటి వేధింపులు నాకు ఎదురు కాలేదు..' అని రచెల్ పేర్కొన్నారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 16 మంది

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 16 మంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి జీవితం, శృంగార కార్యకలాపాల గురించి వార్తలు కోకొల్లలు. తీరా ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఎంతోమంది అమెరికన్లు ‘ట్రంప్ లాంటి వ్యక్తి మా దేశానికి అధ్యక్షుడవడం మా ఖర్మ.' అంటూ బహిరంగంగానే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నిజానికి ట్రంప్‌పై ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 16 మంది మహిళలు ఒకే సమయంలో ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆ ఆరోపణలను, పత్రికల్లో వచ్చిన కథనాలను ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అప్పట్లోనే ఖండించారు. అయితే నిప్పు లేకుండా పొగ వస్తుందా? ఏకంగా దేశాధ్యక్షుడిపైనే నిందలేయడం ద్వారా ఈ మహిళలకు ఒరిగేదేముంది? వారి ఆరోపణల్లో నిజం లేకపోలేదని భావించే వారూ ఎందరో!

ట్రంప్‌పై ఆరోపణలతో...

ట్రంప్‌పై ఆరోపణలతో...

రచెల్‌ కూక్స్‌(35)కు కూడా ఒహియో స్టేట్‌లో మంచి పేరుంది. ప్రస్తుతం హైడెల్‌ బర్గ్‌ యూనివర్సిటీ ఐఎస్‌ఆర్‌ విభాగానికి ఆమె డైరెక్టర్‌‌గా వ్యవహరిస్తున్నారు. విద్యా వ్యవస్థ కోసం ఆమె చేసిన సంస్కరణలు కూడా మంచి ఫలితాన్నిచ్చాయి. అన్నింటికి మించి దేశాధ్యక్షుడు ట్రంప్‌ పై ఆమె చేసే విమర్శలు అక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోతున్నాయి. అందుకే డెమొక్రాటిక్‌ పార్టీ ఏరి కోరి రచెల్ క్రూక్స్‌ను బరిలోకి దించుతోంది. రెండు దఫాలుగా ఒహియో స్టేట్ నుంచి ఎంపికైన బిల్‌ రైనెకెతో క్రూక్స్‌ తలపడబోతున్నారు. ఇక్కడ మే 8 తొలి దఫా ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌-హిల్లరీ కూడా పాల్గొనవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
One of the first women to publicly accuse President Donald Trump of sexual misconduct is running for office. Rachel Crooks, who told the New York Times in 2016 that Mr Trump had kissed her against her will, has announced she will run for state representative in Ohio as a Democrat. “I think my voice should have been heard then, and I'll still fight for it to be heard now,” Ms Crooks told Cosmopolitan. “Americans are really upset with politics as usual, and I want to be a voice for them.” Ms Crooks was one of two women who told the Times about alleged abuses by then-candidate Trump in the run-up to the election. Mr Trump has now been accused by more than a dozen women of various kinds of sexual misconduct, from groping to sexual assault. The president has denied these allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X