వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్బన్ తొలగించి, జుత్తు కత్తిరించి: అమెరికాలో సిక్కు వ్యక్తిపై దాడి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో సిక్కు వ్యక్తి పైన దాడి జరిగింది. కొందరు వ్యక్తులు మన్ సింగ్ ఖల్సా అనే వ్యక్తిని రిచ్‌మండ్ వద్ద అడ్డగించి, అతని టర్బన్ తొలగించి, అతని వెంట్రుకలను కత్తిరించారు. తొలుత, అతని పైన దాడి చేసిన గ్రూపులోని ఓ వ్యక్తి ఖల్సా కారు పైనకి ఓ బీరు సీసా విసిరివేశాడు.

ఆ తర్వాత ఖల్సా తలను అతని కారు నుంచి బలవంతంగా బయటకు లాగి, అతని టర్బన్ తొలగించారు. ఆ తర్వాత అతని వెంట్రుకలను కత్తిరించారని చెబుతున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ నెలలో జరిగింది. బాధితుడికి గాయాలు అయ్యాయి.

దీనిపై సిక్కు సంస్థ న్యాయం కావాలని కోరింది. దాడి నేపథ్యంలో కేసు ఫైల్ చేయాలని కాలిఫోర్నియా లా ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులను కోరింది. మన్ సింగ్ ఖల్సా ఇన్‍‌ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అని, అతని పైన రేసియల్ దాడి జరిగిందని చెప్పారు.

Racial attack in US: Sikh techie faces brutal assault, civil rights group demands justice

ఖల్సా తన మతపరమైన ఆచారంలో భాగంగా టర్బన్ ధరిస్తారు. పొడువైన జుత్తు పెంచుకుంటారు. ఇతను కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్ట్. అతను సెప్టెంబర్ 25వ తేదీన కారులో ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

నిందితులు తన పైన ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేసి గాయపరిచారని, తన సిక్కు విశ్వాసాన్ని టార్గెట్ చేశారని మన్ సింగ్ ఖల్సా ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను టార్గెట్ చేసినప్పుడు ఐదారుగురు తెల్లవారు ఉన్నారని చెప్పారు. వారి వయస్సు 20 నుంచి 30 వరకు ఉంటుందని చెప్పారు.

సిక్కులకు చెందిన ఓ సంస్థ.. ఖల్సా విషయమై రిచ్‌మండ్ పోలీస్ డిపార్టుమెంట్,క కోంట్రా కోస్టా కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి దాడి విషయమై లేఖ కూడా రాశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
A 41-year-old Sikh-American IT specialist was brutally attacked by some men, who knocked off his turban and allegedly cut his religiously-mandated unshorn hair with a knife, prompting a civil rights organisation to demand a hate crime investigation into the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X