• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా: బ్రిటన్‌లో జ్యాతి వివక్షకు గురైన ఓ ఎన్నారై లేఖ

By Nageshwara Rao
|

లండన్: బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత బ్రిటన్‌లో జాతి విద్వేష దాడులు ఎక్కువయ్యాయి. ఇందుకు నిదర్శనం బ్రిటన్‌లోనే పుట్టి పెరిగిన ఓ ప్రవాస భారతీయుడు తనకు ఎదురైనా అనుభవంపై ఓ బహిరంగ లేఖను రాశాడు. ఆ లేఖను 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించింది.

దీంతో బ్రిటన్‌లో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల పౌరులతో పాటు భారతీయులకు వ్యతిరేకంగా కూడా దాడులు కొనసాగుతున్నాయని స్పష్టమైంది. కేశవ్ కపూర్ (26) అనే ప్రవాస భారతీయుడు బ్రిటన్‌లోనే పుట్టాడు. బ్రిటన్‌లోనే పెరిగాడు. అక్కడి సంస్కృతిలో మమేకమైపోయాడు.

బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత అక్కడి యువత ఇప్పుడతన్ని బ్రిటన్ వాసిగా అంగీకరించడం లేదు. బ్రెగ్జిట్ ఓటింగ్ అనంతరం బ్రిటన్‌లో జ్వాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ, దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేశవ్ కపూర్ రాసిన బహిరంగ లేఖలోని వివరాలు...

గత 26 ఏళ్లుగా లండన్‌లో నివసిస్తున్నాను. భారత్ నుంచి వచ్చిన తల్లిదండ్రులకు నేను పుట్టాను. విభిన్న వర్గాల ప్రజలు నివసించే పశ్చిమ లండన్‌లోని హోన్స్‌లో ప్రాంతంలో పెరిగాను. అప్పుడప్పుడు తెల్లవారి నుంచి కొన్ని జాతి వివక్ష వ్యాఖ్యలు విన్నాను. అవి ఎప్పుడూ నన్ను బాధించలేదు.

మా అమ్మ ఇక్కడికి పదేళ్ల వయసులో వచ్చింది. ఆపై 1980 ప్రాంతంలో నాన్న వచ్చి స్థిరపడ్డారు. నేను ఇక్కడ ఉంటున్నందుకు ఎంతో అదృష్టవంతుడినని అనుకునేవాడిని. కానీ నా అభిప్రాయం తప్పని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పటివరకూ కలసిమెలసి ఉన్నవారిని ఒక్కసారిగా దూరం పెట్టేంతగా మనసులు ఎలా మారాయో ఆశ్చర్యంగా ఉంది.

నేనున్న ప్రాంతానికి ఇరుగు పొరుగుగా ఉండే హ్యేస్, హర్లింగ్టన్ ప్రాంతాల్లోని వారు ఇప్పుడు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. గత మంగళవారం నాకిదే అనుభవం ఎదురైంది. తమ దేశాన్ని విడిచి వెళ్లాలని రాయలేని తిట్లు తిట్టారు. దాడి చేశారు. నా మోకాలికి తగిలిన గాయం మానిపోతుంది.

నా సెల్ ఫోన్‌లో విరిగిన వాల్యూమ్ బటన్‌ను తిరిగి అతికించలేకపోవచ్చు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ, స్పందించి వారితో వాదనకు, ప్రతిదాడికి దిగితే, ఏం జరుగుతుందో ఊహించలగను కాబట్టి మిన్నకుండిపోయాను. కానీ మనసు ఊరుకోవడం లేదు. ఇది ఈయూ నుంచి వీడిపోవాలని ఓట్లేసిన ప్రాంతం.

బ్రెగ్జిట్ రెఫరెండం గురించి పక్కన బెడితే, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న చర్చంతా వలసవాదుల గురించే. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారంతా జాతి వివక్షను చూపుతున్నారని నేను అనడం లేదు. ఇదే సమయంలో ఈ తరహా ధోరణిని తమ మనసుల్లో పెంచుకుంటున్న వారి సంఖ్య మాత్రం అధికమవుతోంది.

వాస్తవానికి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగలడమంటే, బ్రిటన్‌లోని విదేశీయులందరినీ తరిమివేయవచ్చన్న భావన చాల మందిలో కనిపిస్తోంది. అయితే నాలాంటి వారు సోషల్ మీడియాల్లో మాత్రం ఒంటరి కాదు. గత వారం మాంచెస్టర్‌లోని ఓ ట్రామ్‌లో జరిగిన జాతి విద్వేష వీడియో ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులను నమోదు చేశారు.

ముఖ్యంగా ఆఫ్రికా ప్రజలపై దాడులు చేయడం దారుణం. జరిగిన ఘటనల సంఖ్యను పరిశీలిస్తే, విదేశీయులు ఎంత ఓపికగా ఉంటున్నారో తెలుస్తుంది. నేను కూడా ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. నాపై దాడి చేసిన వారిని గుర్తించాలన్న కోరిక కూడా లేదు. ఈ వేధింపులు యువత నుంచే వస్తున్నాయి.

బ్రిటన్ పెద్దలు మాత్రం పెద్దలు తమ సంస్కృతి దెబ్బతింటోందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా జీవించాలనేది వారి ఆలోచన. అందరం కూడా ఇక్కడ క్షేమంగా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇక ఈ పరిస్థితి మారి జాతి వివక్షత లేని పాత బ్రిటన్‌ను చూడాలని ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I’ve lived in this country for 26 years. I was born to Indian parents in Ealing and raised in Hounslow, both multicultural West London areas, so my experiences with racism until now were limited to snide remarks and idiosyncrasies — the usual schoolyard “race banter.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more