వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్డెన్ ఛాన్స్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురాం రాజన్..

|
Google Oneindia TeluguNews

లండన్ : ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలోనే మరో కీలక పదవి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మూడు శతాబ్దాల చరిత్ర కలిసిన బీఓఈ విదేశీయులకు సైతం గవర్నర్‌గా అవకాశమిస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కొత్త గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్ నిలిచారు. ప్రస్తుతం మార్క్ కర్నే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన పదవీకాలం 2020 జనవరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపికపై సర్వత్రా చర్చ సాగుతోంది.

గిఫ్ట్‌కు ఆశపడి రూ.85వేలు పోగొట్టుకున్న టాలీవుడ్ భామ గిఫ్ట్‌కు ఆశపడి రూ.85వేలు పోగొట్టుకున్న టాలీవుడ్ భామ

రేసులో ముగ్గురు

రేసులో ముగ్గురు

ప్రస్తుతం బ్యాంక్ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్‌తో కలిసి ముగ్గురున్నాయి. డార్ట్‌మౌత్ కాలేజ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ బ్లాంచ్‌ప్లవర్, బీఓఐ ఫైనాన్షియల్ రెగ్యులేటర్‌గా పనిచేసిన అనుభవమున్న ఆండ్రూ బైలీ గవర్నర్ పోస్టుకు పోటీ పడుతున్నారు. అయితే వీరద్దరి కన్నా రఘురామ్ రాజన్ రేసులో ముందు ఉన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రయ పూర్తైన వెంటనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్

మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్‌కు గొప్ప ఆర్థికవేత్త. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనమిస్ట్, రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిన రాజన్ ప్రపంచదేశాలను హెచ్చరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో దిట్ట అయిన ఆయన.. ముక్కు సూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది.

అకడమిక్స్‌పై ఆసక్తి

అకడమిక్స్‌పై ఆసక్తి

ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత అకడమిక్స్‌పై ఉన్న ఆసక్తితో ఆయన టీచింగ్ కెరీర్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

రాజకీయాలు ఇష్టంలేదు

రాజకీయాలు ఇష్టంలేదు

ఇదిలా ఉంటే రఘురాజ్ రాజన్ భారత రాజకీయాల్లో అడుగుపెడతారన్న ఊహాగానాలు వినిపించాయి. ఎన్నికల అనంతరం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజన్.. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తిలేదని చెప్పారు. ఒకవేళ తాను పాలిటిక్స్‌లోకి ఎంటరైతే... తన భార్య తనను వదిలేస్తుందని చెప్పారు.

English summary
Raghuram Rajan has delivered some uncomfortable economic truths in a career spanning the IMF and powerful positions in his native India. The question is whether Brexit Britain is ready to hear them from another foreign Bank of England governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X