వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతున్న అమెరికాలో అతను ఓవర్ నైట్ హీరో.. ఎవరతను.. అసలేం చేశాడు..?

|
Google Oneindia TeluguNews

నాగరిక సమాజం,నాగరికులం అని గొప్పలు పోవడమే తప్ప అభివృద్ది చెందిన సమాజాల్లోనూ అసమ విలువలు ఇప్పటికీ అలాగే పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిసార్లు ఉపరితలంపై అది కనిపించకపోవచ్చు కానీ.. నరనరాన వివక్ష నాటుకుపోయిన మనస్తత్వాలు అప్పుడప్పుడు తమ ఆధిపత్య ఉనికి కోసం బుసలు కొడుతూనే ఉంటాయి. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం కూడా ఇటువంటిదే. అమెరికాలో జాత్యహంకారం కొత్తేమీ కాదు. మార్టిన్ లూథర్ కింగ్,మాల్కమ్ ఎక్స్ వంటి యోధుల పోరాటంతో విముక్తి పొందిన ఆఫ్రో అమెరికన్లు.. ఇప్పుడు మరోసారి పోరాడాల్సిన అవసరం తలెత్తింది. ఆ పోరాటానికి శ్వేత జాతీయులు,ఇండో అమెరికన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నల్ల జాతీయులకు అండగా నిలిచిన ఓ ఇండో అమెరికన్ ఓవర్ నైట్ హీరో అయిపోయారు.

తన ఇంట్లో ఆశ్రయమిచ్చిన దూబే..

జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ సోమవారం(జూన్ 1) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆందోళనలు చేపట్టిన 70 మంది ఆందోళనకారులకు.. ఇండో అమెరికన్ రాహుల్ దూబే(44) ఆ రాత్రికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. పోలీసులు ఆందోళనకారులపై పెప్పర్ స్ప్రే,టియర్ గ్యాస్ ప్రయోగించడంతో.. వారి నుంచి పెద్ద ఎత్తున హాహాకారాలు వినిపించాయి. చాలామంది ఆందోళనకారులు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. దూబే వారికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు.

పోలీసులు విరుచుకుపడటంతో హాహాకారాలు..

పోలీసులు విరుచుకుపడటంతో హాహాకారాలు..


అప్పటికే దూబే ఆందోళనల్లో పాల్గొంటున్నవారికి తన ఇంట్లో వాష్ రూమ్ వాడుకునేందుకు,సెల్ ఫోన్స్ చార్జింగ్ పెట్టుకునేందుకు అనుమతించాడు. ఒక్కసారిగా పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడటంతో.. వారిని తన ఇంట్లో తలదాచుకోమని చెప్పాడు. 'అక్కడ అకస్మాత్తుగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. పెప్పర్ స్ప్రే జల్లడంతో నా కళ్లు కూడా మంట మండటం మొదలైంది. గతంలో నేనెప్పుడూ విననంతగా బయటి నుంచి పెద్ద ఎత్తున హాహాకారాలు వినిపించాయి.' అని దూబే స్థానిక మీడియాతో చెప్పాడు.

ఇంట్లోకి రమ్మని అరిచిన దూబే..

ఇంట్లోకి రమ్మని అరిచిన దూబే..

'నేను వాళ్లను ఇంట్లోకి రమ్మని పది నిమిషాల పాటు బిగ్గరగా అరిచాను. పోలీసులు వారి తలలపై పెప్పర్ స్ప్రే జల్లుతున్నారు. ఒక గంటన్నరపాటు అంతా అల్లకల్లోలంగా అనిపించింది. అప్పటికే చాలాసార్లు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించి పోలీసులు విఫలమయ్యారు. ఆందోళనకారులకు నా ఇంట్లో ఆశ్రయమిచ్చాక.. కిటికీల్లో నుంచి కూడా వారు పెప్పర్ స్ప్రే జల్లారు.' అని చప్పారు. మొత్తం మీద ఆ రాత్రి దూబే ఇంట్లోనే తలదాచుకున్న ఆందోళనకారులు మరుసటిరోజు తెల్లవారుజామున 6గంటలకు అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఓవర్ నైట్ హీరోగా..

ఓవర్ నైట్ హీరోగా..

రాహుల్ దూబే ఆందోళనకారులకు ఆశ్రయం ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అతన్ని హీరో అంటూ చాలామంది కొనియాడారు. అయితే తాను ఆందోళనకారుల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని.. కేవలం వాళ్లకు ఆశ్రయమిచ్చేందుకు తన ఇంటి తలుపులను తెరిచానని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆందోళనకారులు శాంతియుత పంథాలో తమ పోరాటాన్ని కొనసాగిస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. దూబే 17 ఏళ్లుగా అమెరికాలో నివాసముంటున్నాడు. బిజినెస్&ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన రాహుల్.. అమెరికా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్(AHIP)లో పనిచేస్తున్నాడు. జాత్యహంకారంపై పోరాడుతున్న నల్ల జాతీయులకు అండగా నిలిచిన దూబే.. ఓవర్ నైట్ హీరోగా వార్తల్లో నిలిచాడు.

English summary
Indian-American Rahul Dubey emerged as an overnight hero in the US after he sheltered nearly 70 protesters in his house in Washington D.C. Monday night.The US has witnessed violent protests in the past week, after the death of 46-year-old George Floyd in Minneapolis. The African-American man died after a white policeman pressed a knee into his neck for more than eight minutes, ignoring the former’s repeated pleas that he could not breathe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X