వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రో రాజాకు మరో బంపర్ ఆఫర్: స్పేస్ ఎక్స్: మిషన్ కమాండర్‌గా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, అమెరికా వైమానిక దళ కల్నల్ రాజా చారికి మరో అద్భుత అవకాశం లభించింది. మొన్నటికి మొన్న నాసా మూన్ మిషన్‌కు ఎంపికైన ఆయన ఈ సారి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) చేపట్టబోతోన్న ప్రయోగానికి ఎంపిక అయ్యారు. ఎంపిక కావడం మాత్రమే కాదు.. ఆ టీమ్‌ను లీడ్ చేయబోతోన్నారు. ప్రైవేటు అంతరిక్ష పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టబోతోన్న మిషన్ అది. నలుగురు సభ్యుల బృందానికి రాజా చారి నాయకత్వాన్ని వహిస్తారు. స్పేస్ ఎక్స్ మిషన్ కోసం ఓ భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ ఎంపిక కావడం ఇదే తొలిసారి.

నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ మిషన్‌ను నిర్వహించబోతోన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు ఈ టీమ్‌ను పంపించబోతోంది. స్పేస్ ఎక్స్ క్రూ-3 మిషన్‌‌గా దీనికి పేరు పెట్టారు. దీనికి రాజా చారి కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఈ మిషన్ కోసం మొత్తం ముగ్గురిని ఎంపిక చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. రాజా చారితో పాటు టామ్ మార్ష్‌బర్న్, మథియాస్ మౌరర్ ఎంపికయ్యారు. మార్ష్‌బర్న్.. ఈ మిషన్ పైలెట్‌గా, మథియాస్ మిషన్ స్పెషలిస్ట్‌గా ఉంటారు. ఈ మిషన్ కోసం మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది.

Raja Chari to lead SpaceX Crew-3 mission to ISS, expected to launch in the autumn of 2021

రాజా జాన్ వుర్పుత్తూర్.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2017లో నాసా నిర్వహించిన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. అక్కడ ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్న అనంతరం నాసా చేపట్టిన ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యారు. 2024 నాటికి చంద్రుడిపై నాసా పంపించబోయే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్‌ టీమ్‌లో రాజా చారి ఒకరు.
తాజాగా స్పేస్ ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా మరో అవకాశాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో స్పేస్ ఎక్స్ సంస్థ.. ఈ మిషన్‌ను చేపట్టబోతోంది.

రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వుర్పుతూర్ చారి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌. శ్రీనివాసాచారి ఇది వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2017లో వ్యోమగాముల శిక్షణ కోసం నాసా దరఖాస్తులు ఆహ్వానించగా.. రాజాచారి సహా పలువురు ఎంపిక అయ్యారు. రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చారు. షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు.

English summary
NASA and European Space Agency (ESA) have selected three astronauts, including Indian-American Raja Chari, to serve as crew members for SpaceX Crew-3 mission to the International Space Station (ISS), which is expected to launch in the autumn of 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X