వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికపై రేప్: అమెరికాకు భారత్ నిందితుడి అప్పగింత

|
Google Oneindia TeluguNews

 Rapist back to US after four years
న్యూఢిల్లీ/న్యూయార్క్: పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఓ భారతీయుడిని భారత ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. నేరగాళ్ల మార్పిడి ఒప్పందంలో భాగంగా అత్యాచారం కేసులో నిందితుడైన అమిత్ సింగ్‌ను ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. కాగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలో 2009 మార్చి 11న పాఠశాలకు వెళుతున్న 14 ఏళ్ల బాలికను అక్కడే నివాసం ఉంటున్న ఎన్నారై అమిత్ సింగ్ బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసి పాఠశాల దగ్గర విడిచిపెట్టాడు. బాధితురాలు తన పాఠశాల టీచర్‌కి జరిగిన విషయం తెలపడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు అమిత్ ఫొటోను గుర్తించడంతో పోలీసులు అతనిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడం వంటి నేరాల కింద విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ఐదురోజుల అనంతరం అమిత్ సింగ్ భారతదేశానికి వచ్చేశాడు.

అప్పటికే అమిత్ సింగ్‌కి న్యాయమూర్తి యాంజెలో డెలిగటి రిమాండ్ విధించారు. అక్టోబర్ 11న మళ్లీ విచారణ నిమిత్తం కోర్టు ముందుకు అమిత్ సింగ్ రావాలని నసావు కౌంటీ జిల్లా అటార్నీ కాథలీన్ రైస్ పేర్కొన్నారు. నేరాలు రుజువైతే అమిత్ సింగ్‌కు 25 ఏళ్లపాటు జైలు శిక్ష విధించే అవకాశముంది.

2011 ఫిబ్రవరిలోనే అమిత్ సింగ్‌పై ఇంటర్ పోల్ అంతర్జాతీయ వారెంట్ జారీ చేసింది. నిందితుడు అమిత్ సింగ్ బాలికను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని, ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయవాది రైస్ పేర్కొన్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం నిందితుడు అమిత్ సింగ్‌ను అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకెళ్లారు. అనంతరం డిఎన్ఏ శాంపిళ్లను పోల్చి చూసి నేరానికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

English summary
A Long Island man who fled to India after being accused of raping a 14-year-old girl was extradited back to the US this weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X