• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతరించిపోతున్న అరుదైన మంచినీటి చేప.. ఇలా కాపాడుతున్నారు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"ఇవి చాలా చిన్న చేపలు. రంగులతో ఆకట్టుకోవు. వీటిని సంరక్షించడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు" అని చెస్టర్ జూ పరిరక్షకురాలు జెరార్డో గార్సియా వివరించారు.

Tequil fish

వీటిని టెకీలా చేపలని అంటారు. వీటిని అంతరించినట్లు ప్రకటించిన తర్వాత అవి తిరిగి అడవుల్లో కనిపించడం మొదలయింది.

"ఇవి 2003 నుంచి కనిపించటం లేదు. అయితే, అవిప్పుడు నైరుతి మెక్సికోలో తిరిగి నదుల్లో కనిపిస్తున్నాయి.

మంచి నీటితో కూడిన ఆవాసాల్లో జీవరాశులనెలా సంరక్షించవచ్చో ఉదాహరణగా చెప్పేందుకు వీటిని తిరిగి ప్రవేశపెట్టారు.

భూమి పై ఉన్న మంచి నీటి ఆవాసాలకు అత్యంత ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసిఎన్) పేర్కొంది. ముఖ్యంగా మంచి నీటి పై ఆధారపడి మనుగడ సాగించే జీవ జాతులు భూమి పై లేదా సముద్రంలో ఉన్న జీవజాతుల కంటే వేగంగా అంతరిస్తున్నాయి.

కాలుష్యం కేవలం వన్య ప్రాణులకు మాత్రమే కాకుండా, మంచి నీరు, నదులు, సరస్సుల ఆధారంగా సాగే ఆహార సరఫరాలకు కూడా ముప్పు కలిగిస్తోంది.

అయితే, టెకీలా చేపలను విడుదల చేసే కేంద్రం జాలిస్కో, మెక్సికో దగ్గరగా నివసిస్తున్న స్థానిక సమాజం అక్కడున్న నదులు, సరస్సుల్లో నీటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ చేపలను తిరిగి నీటిలోకి ప్రవేశపెట్టడంతో మిచోవ్‌కానా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒమర్ డొమినిగ్వేజ్ బృందం సభ్యులు చొరవ తీసుకున్నారు.

"స్థానికుల సహాయం లేకుండా మేమీ పని చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. దీర్ఘ కాలికంగా వీటిని సంరక్షించేందుకు స్థానికులే సహకరిస్తున్నారు" అని చెప్పారు.

"అంతరించిపోయిన చేపలను తిరిగి నదీ జలాల్లో ప్రవేశపెట్టడం మెక్సికోలో ఇదే మొదటిసారి. ఈ విధానం జీవరాసుల సంరక్షణ విషయంలో ఒక ప్రామాణికంగా నిలుస్తుంది" అని అన్నారు.

"ఇప్పటికే దేశంలో అంతరించిపోయే దశలో లేదా అంతరించి పోయిన చేపల జాతులను సంరక్షించేందుకు ఈ ప్రాజెక్ట్ నాంది పలుకుతుంది" అని అన్నారు.

పరిరక్షకులు మొదట్లో 1500 చేపలను విడుదల చేయగా, నదుల్లో ప్రస్తుతం వాటి జనాభా పెరుగుతోందని తెలిపారు.

ఈ ప్రాజెక్టును మెక్సికో యూకేలో ఉన్న పరిరక్షకుల మధ్య భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ఇది కొన్ని దశాబ్ధాల పురాతనమైన భాగస్వామ్యం.

1998లో ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు మిచోవ్‌కానా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు చెస్టర్ జూ నుంచి 5 జతల చేపలను అందుకున్నారు.

వీటిని ఇంగ్లీష్ అక్వేరియస్ట్ ఇవాన్ డిబిల్ అందించారు. ఈ పది చేపలు యూనివర్సిటీ పరిశోధనశాలలో కొత్త కాలనీలో చేరాయి.

అక్కడ నిపుణులు వాటిని 15 సంవత్సరాల పాటు కాపాడి, వాటి జనాభాను పెంచారు.

వాటిని పర్యావరణంలోకి ప్రవేశపెట్టే ముందు, 40 మగ , 40 ఆడ చేపలను కాలనీ నుంచి బయటకు తీసి, కృత్రిమంగా నిర్మించిన సరస్సులో ప్రవేశపెట్టారు.

ముఖ్యంగా, పరిశోధనశాలలో పెరిగిన చేపలను మారుతూ ఉండే ఆహార పరిస్థితులు, పోటీదారులు, పరాన్న జీవులు, వేటాడి చంపే ఇతర జీవరాసుల మధ్యలో విడిచిపెట్టారు. నాలుగేళ్ల తర్వాత ఈ చేపల జనాభా 10,000కు పెరిగింది. ఈ పెరిగిన జనాభా తిరిగి నదీజలాల్లో వదిలిపెట్టేందుకు ఆధారంగా మారాయి.

ఈ విధానం ఇతర మంచి నీటి చేపలను పెంచేందుకు ఒక నమూనాగా మారుతుందని ఆశిస్తున్నారు. ఆచోక్ అనే రకమైన చేప కూడా మెక్సికోకు ఉత్తరాన ఉన్న ఒకే ఒక్క సరస్సులో లభిస్తుంది. వీటిని సంరక్షించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడవచ్చు. ఈ చేపలు కూడా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఈ చేపలకు స్వస్థత చేకూర్చే లక్షణాలున్నాయని స్థానిక సంస్కృతిలో నమ్ముతారు. ఇవి పూర్తిగా అంతరించిపోకుండా, స్థానిక సన్యాసినులు కూడా కొంత వరకు పాత్ర పోషించారు. వీరు జంతువుల కోసం సురక్షిత బ్రీడింగ్ కేంద్రాలను నడుపుతారు.

"జంతువులు తిరిగి వాటి ఆవాసాల్లో మనుగడ సాగించేందుకు వాటిని సరైన సమయంలో, సరైన వాతావరణంలో ప్రవేశపెట్టడం ద్వారా సాధ్యమవుతుంది" అని జెరార్డో గార్సియా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rare freshwater fish endangered, it is being saved
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X