వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో నేడు అద్భుతం: సూపర్‌బ్లడ్ మూన్ దర్శనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఖగోళ చరిత్రలో ఆదివారం రాత్రి ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. గత ముప్పై మూడేళ్లలో ఎన్నడూ జరగనిది... మరో పద్దెనిమిదేళ్ల వరకు జరిగే అవకాశం లేని అద్భుత దృశ్యం... 'సూపర్ బ్లడ్ మూన్' దర్శనమివ్వనుంది.

భూమికి, చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం బాగా తగ్గిపోయినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. అయితే ఈ సందర్భంగా సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి సంభవించనున్నాయి. ఆదివారం రాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ సాధారణంగానే చంద్రుడిని కప్పేస్తుంది.

సూపర్ మూన్ నేపథ్యంలో చంద్రుడిపై కొంత సూర్యకాంతి పడుతుంది. దీంతో చందమామ నారింజ రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈ కారణంగా దీనిని సూపర్ బ్లడ్ మూన్ అంటారు.

Rare super blood moon today

ఈ సమయంలో సాధారణ పరిమాణం కన్నా పద్నాలుగు శాతం పెద్ద పరిమాణంలో, 30 శాతం ఎక్కువ ఆకర్షణీయంగా చంద్రుడు కనిపిస్తాడు. ఇలాంటి ఘట్టం ఇంతకుముందు 1982లో చోటుచేసుకుంది.

మళ్లీ 2033 వరకూ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. దీంతో ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఖగోళ శాస్త్రజ్ఞులు నిరీక్షిస్తున్నారు. అయితే ఇది భారత్‌లో కనిపించే అవకాశంలేదు. ఉత్తర అమెరికాలోని తూర్పు తీరప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది.

English summary
A rare astronomical phenomenon on Sunday night will produce a moon that will appear slightly bigger than usual and have a reddish hue, an event known as a super blood moon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X