వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా నేతృత్వంలో 15 ఆసియా దేశాల స్వేచ్ఛా వాణిజ్య కూటమి ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హనోయ్: చైనా మద్దతుతో అగ్రరాజ్యం అమెరికా లేని ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థలోని 15 దేశాలు స్వేచ్ఛా వాణిజ్య కూటమిగా ఏర్పాటు అయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కూటమి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక ఆ దేశం బయటకు వచ్చేసింది. హనోయ్‌లో జరిగిన రీజియనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్షిప్‌ (ఆర్‌సెప్) సమ్మిట్‌లో ఈ కూటమి ఏర్పాటు జరిగింది. ఈ కూటమి నుంచి 2017లో అమెరికా బయటకు వచ్చేసింది.

అమెరికా కూటమి నుంచి వైదొలగడంతో చైనా ఆధిపత్యం ఎక్కువగా అవుతుందని చెప్పొచ్చు. ఆగ్నేసియా, జపాన్ మరియు కొరియా దేశాలతో భాగస్వామ్యంలో చైనా పాత్ర మరింత బలపడే అవకాశాలున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఆర్థికంగా మరింత బలోపేతం కావడమే కాకుండా ప్రాంతీయంగా దృఢమైన వాణిజ్య నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది.

china

ఆర్‌సెప్ వేదికగా చైనా ఇతర ఓవర్సీస్‌ మార్కెట్లు, టెక్నాలజీలపై ఆధారపడే అవసరం కూడా ఉండదని గ్రేటర్ చైనా ఐఎన్‌జీ చీఫ్ ఎకానమిస్ట్ ఐరిస్ పాంగ్ చెప్పారు. ఆర్‌సెప్‌లో సౌత్ ఈస్టీ ఏషియన్‌కు చెందిన 10 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. ఇందులో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు కూడా ఉంటాయి. ఇక పలు రంగాల్లో సుంకాలను తగ్గించుకునేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆసియా సమాఖ్య సమావేశం సందర్భంగా పలువుదు దేశాధినేతలు చైనా అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూనే ఒప్పందంను కుదుర్చుకున్నారు.ఇక కరోనా మహమ్మారి తర్వాత ఈ చైనా అమెరికా వాణిజ్యం సంబంధాలు ఎలా ఉంటాయో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ కూటమి ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
The Regional Comprehensive Economic Partnership (RCEP),which includes 10 Southeast Asian economies along with China, Japan, South Korea, New Zealand and Australia,is the world's largest trade pact in terms of GDP, analysts say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X