వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండిషన్స్ అప్లై: ట్రంప్‌తో మూడో దఫా చర్చలకు సిద్ధమన్న కిమ్ జాంగ్ ఉన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ట్రంప్‌తో మూడోసారి చర్చలకు సిద్ధమన్న కిమ్ కండిషన్స్ అప్లై..!! || Oneindia Telugu

ప్యాంగ్యాంగ్ : రెండు సార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు విఫలమైన తర్వాత మూడోసారి కూడా అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. అయితే ఇందుకు ఓ షరతు కూడా ఆయన విధించారు. ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం, నీతిమంతమైన పరిష్కారంతో వస్తే అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్ ప్రకటించారు. హనోయ్‌లో జరిగిన సమావేశం విఫలం అవడంపై ఇక కిమ్ ఎప్పటికీ అమెరికాతో చర్చలు జరపరనే వార్త ప్రచారంలోకి వచ్చిందని చెప్పిన కిమ్... తాను ఇప్పటికీ చర్చలు జరిపేందుకు సిద్ధమని అన్నారు.

<strong>గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?</strong>గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?

సరైన పద్దతి, సరైన వైఖరితో అమెరికా ప్రతిపాదనలతో వస్తే ఉత్తరకొరియా మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కిమ్ చెప్పినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందం తయారు చేస్తే ఆ ఒప్పందపత్రంపై సంతకం చేసేందుకు తను ఏమాత్రం వెనకాడబోనని కిమ్ చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.ఇదంతా అమెరికా ఎలాంటి ప్రతిపాదనతో ముందుకొస్తుందనేదానిపైనే ఆదారపడి ఉంటుందని కిమ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Ready for third round of talks with Trump on condition,says Kim

ఇదిలా ఉంటే పూర్తి స్థాయిలో అణుప్రయోగాలకు స్వస్తి పలకాలని చెబుతున్న అమెరికా ప్రతిపాదనను కిమ్ తిరస్కరించినట్లు కొరియా దేశం మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర కొరియాతో చర్చలు జరపాలంటే అమెరికా సరైన పద్దతిని అవలంబించాలని కిమ్ కోరినట్లు ఆ మీడియా వెల్లడించింది. ఇక అమెరికా పర్యటనలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ పర్యటిస్తున్న సమయంలో కిమ్ జాంగ్ ఉన్న వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక మూన్‌తో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు అణుప్రయోగాలపై ఆంక్షలు యథావిధిగానే కొనసాగిస్తూనే కిమ్‌తో చర్చలు జరపాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ట్రంప్ మూన్‌తో తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు మరోసారి కిమ్‌తో చర్చలు జరిపేందుకు మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.

English summary
North Korean leader Kim Jong Un says he's open to having a third summit with President Donald Trump if the United States could offer mutually acceptable terms for an agreement by the end of the year.Pyongyang's official Korean Central News Agency on Saturday said Kim's speech came during a session of the North Korea's rubber-stamp parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X