వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే పని మొదలుపెట్టిన కమలా హ్యారిస్ -ప్రమాణం చేసిన వెంటనే ఇలా..

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాకు తొలి నల్లజాతి, భారత సంతతి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కొద్ది నిమిషాలకే కమలా హ్యారిస్ తన పనిని మొదలుపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ తెంపరితనం కారణంగా అధికార మార్పిడిపై ఉత్కంఠ నెలకొనగా, చివరికి అనుకున్న తేదీ.. జనవరి 20న ప్రెసిడెంట్ గా జోబైడెన్, వైస్ ప్రెసిడెంట్ గా కమల బాధ్యతలు చేపట్టారు..

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ పదవీ బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే కమల హ్యారిస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 'సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..''అంటూ తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆమె ఓ ట్వీట్ చేశారు. క్యాపిటల్‌ హిల్‌ వెస్ట్‌ ఫ్రంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కమలాహారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణం స్వీకారం చేయించారు.

జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ'కి లవ్ ట్వీట్జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ'కి లవ్ ట్వీట్

ready-to-serve-kamala-harris-first-tweet-as-us-vice-president

కమలాదేవి హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు, తండ్రి డోనాల్డ్‌ హ్యారిస్‌ జమైకాకు చెందినవారు. 1964 అక్టోబర్‌ 20 న జన్మించిన కమలా హ్యారిస్‌.. ఓక్‌ల్యాండ్‌లోని వెస్ట్‌మౌంట్‌ హైస్కూల్‌ నుంచి హైస్కూల్‌ విద్య, యూసీ హేస్టింగ్స్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అభ్యసించారు. కమలా హ్యారిస్‌ కు న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవముంది. ఇక..

అమెరికాలో వివక్షకు తావులేదని, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నదని నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రసంగించారు. అందరి అమెరికన్ల అధ్యక్షుడుగా ఉంటాని చెప్పారు. అమెరికా ఇప్పటికే అనేక అవరోధాలను అధిగమించిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని బైడెన్‌ తెలిపారు. హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. దీనికి మీ అందరి సహకారం కావాలని, దేశాభివృద్ధికి అందరి చేయూత అవసరమని అన్నారు.

జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్‌మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్‌మెంట్జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్‌మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్‌మెంట్

English summary
Minutes after taking oath as the 49th Vice-President of the United States, Kamala Devi Harris said she was 'ready to serve'. Harris made history by becoming the first woman, first African-American, and first Asian-American to become the Vice-President of the US after taking oath in a historical swearing-in ceremony on Wednesday. Joe Biden also took oath in the ceremony as the 46th President of the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X