• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..’, ఇమ్రాన్‌ మూడోపెళ్లిపై రెండో భార్య ఫైర్!

By Ramesh Babu
|

లాహోర్‌: మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో పెళ్లిపై ఆయన రెండో భార్య రేహమ్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌ పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించారు. 'టైమ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేహమ్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

  Cricketer Imran Khan 3rd Marriage with Spiritual guide.

  ''నేను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉంది. నా ముందే ఆమెతో చనువుగా ఉండేవాడు. అందుకే 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశా. ఇమ్రాన్‌ లాంటి నీతిమాలిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..'' అని రేహమ్ వ్యాఖ్యానించారు.

  Imran-bushra-reham

  అంతేకాదు, ''మొన్న ఆదివారం ఇమ్రాన్‌ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించింది. కానీ నిజమేంటంటే.. ఆ తంతు నెలన్నర కిందటే జరిగింది. నా పెళ్లప్పుడు కూడా ఇలానే జరిగింది. మేం పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారు.. '' అని రేహమ్‌ పేర్కొంది.

  1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్‌.. మరో జర్నలిస్ట్ అయిన రేహమ్‌ను 2015లో రెండో పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు తాజాగా మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకున్నారు.

  మరోవైపు రేహమ్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్ అభిమానులు‌.. కౌంటర్‌ ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. 'రేహమ్‌ వ్యాఖ్యలు వాస్తవాలేనని నమ్ముతున్నారా?' అని ట్విటర్‌లో పోల్‌ క్వశ్చన్‌ పెట్టారు. ప్రతిగా రేహమ్‌ సైతం తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. గడిచిన మూడేళ్లుగా ఇమ్రాన్‌- బుష్రాలు కలిసే ఉంటున్నట్లు స్వయంగా బుష్రా మాజీ భర్తే చెప్పినట్లు పేర్కొన్నారు.

  'ఇమ్రాన్‌-బుష్రాలు జనవరిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మొన్ననే పెళ్లైనట్లు పార్టీ ప్రకటించడం దారుణం..' అని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్‌ వర్గీయులు 'వంద మంది కుట్రదారులు వచ్చినా మా గెలుపును ఆపలేరు..'అంటూ కవరింగ్‌ ఇచ్చారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Reham Khan, former wife of Pakistan Tehreek-e-Insaf (PTI) Chairman Imran Khan, has accused him of being “unfaithful”, according to British media, days after the cricketer-turned-politician confirmed his third marriage. Imran Khan, 66, tied the knot with Bushra Riaz Wattoo in a private ceremony in Lahore on Sunday. The PTI confirmed party chairman’s third marriage with Bushra, known to be his spiritual guide. Imran first tied the knot with Jemima Khan on May 16, 1995 that ended in divorce after nine years on June 22, 2004. His second marriage with Reham Khan, then a TV anchor, lasted for barely 10 months.Reham alleged that the relationship between the newlyweds had begun before her ten-month marriage ended in divorce in 2015, leading British daily The Times reported.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more