వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఆమోదించిన తొలి యాంటీవైరల్ డ్రగ్ ‘రెమిడెసివిర్’: సత్ఫలితాలే కారణం!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా రోగులకు చికిత్స అందించే తొలి తొలి యాంటీ వైరల్ డ్రగ్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా ఇస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌ను పూర్తిస్థాయి కరోనా ఔషధంగా వినియోగించుకునేందుకు అనుమతించింది. దీంతో రెమిడెడిసివిర్.. కరోనా చికిత్సకు ఆమోదం పొందిన తొలి ఔషదంగా నిలిచింది.

 కరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులు కరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులు

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న దిగ్గజ ఔషధ తయారీ సంస్థ గిలీద్ సైన్సెస్ రెమిడెసివిర్‌ను వెక్లరీ పేరిట ఉత్పత్తి చేస్తోంది. కరోనా బాధితులు కోలుకునే సమయాన్ని ఇది 15-10 రోజులకు తగ్గిస్తున్నట్లు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్త(ఎన్ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అధ్యయనాల్లో తేలింది.

Remdesivir: US Approves First Antiviral Drug to Treat Covid-19, Cuts Recovery Period by 5 Days

కాగా, శరీరంలో కరోనావైరస్ పునరుత్పత్తి కాకుండా రెమిడెసివిర్ అడ్డుకుంటున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. అయితే, దీన్ని యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో మాత్రం కలిపి ఉపయోగించవద్దని హెచ్చరించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌.. రెమిడెసివిర్ ప్రభావాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.

కరోనాబారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చికిత్సలో భాగంగా రెమిడిసివిర్‌ను తీసుకోవడం గమనార్హం. 12 ఏళ్లు పైబడి, కనీసం 40 కిలోల బరువున్న వారికి ఈ ఔషధాన్ని ఇవ్వవచ్చు. అయితే, కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే రెమిడెసివిర్‌ను అందించాలి. 12ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారికి అత్యవసర అనుమతి తీసుకుని ఉపయోగించవచ్చు.

Recommended Video

US Presidential Elections : Uncertainity ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 80 లక్షల మందికిపైగా కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి రోజు దాదాపు 50 వేల కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం.

English summary
U.S. regulators on Thursday approved the first drug to treat COVID-19: remdesivir, an antiviral medicine given through an IV for patients needing hospitalisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X