వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్యం పై ఇజ్రాయిల్ నిఘా: వైట్‌హౌజ్ వద్ద లభ్యమైన అతిచిన్న పరికరాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాపై ఇజ్రాయిల్ కన్నేసిందా..? అక్కడ జరిగే వ్యవహారాలు తెలుసుకోవాలనే ప్లాన్ చేసిందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌‌కు సమీపంలో సెల్‌ఫోన్‌లతో కూడిన సర్వేలియన్స్ పరికరాలను ఇజ్రాయిల్ అమర్చినట్లు ట్రంప్ ప్రభుత్వం తేల్చిందని ఓ అంతర్జాతీయ పత్రిక కథనంను ప్రచురించింది. ఒక్క వైట్ హౌజ్‌ దగ్గరే కాదని ఇతర ప్రాంతాల్లో కూడా సర్వేలియన్స్ ఎక్విప్‌మెంట్‌లను అమర్చినట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇజ్రాయిల్ అలా ఎప్పటికీ చేయదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.

వైట్‌హౌజ్ మూవ్‌మెంట్స్ తెలుసుకునేందుకేనా..?

వైట్‌హౌజ్ మూవ్‌మెంట్స్ తెలుసుకునేందుకేనా..?

అమెరికా అధ్యక్షుడి ట్రంప్ మూవ్‌మెంట్లు ఇతర ఉన్నతాధికారుల గురించి పలు అంశాలు తెలుసుకునేందుకే ఇజ్రాయిల్ నిఘా పరికరాలను ఏర్పాటు చేసి ఉంటుందని అమెరికా ప్రభుత్వం మాజీ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో ఎంతవరకు విజయం సాధించారనేదానిపై మాత్రం క్లారిటీ లేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ చేసిన ఈ పనికి తాము ఎవరినీ శిక్షంచబోమని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు సమాచారం. స్టింగ్ రేస్ అనే అతి చిన్న పరికరాలను అమర్చినట్లు ముగ్గురు మాజీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవి సెల్‌ టవర్లలా వ్యవహరిస్తాయని దీని ద్వారా ప్రతి మూవ్‌మెంట్‌ను కనుగొనొచ్చని అమెరికా మాజీ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే వీటిని ఫోరెన్సిక్ అనాలిసిస్‌కు పంపగా ఈ పరికరాలను ఇజ్రాయిల్ అక్కడ ఉంచినట్లుగా తేలిందని వెల్లడించారు.

 పరికరాల మూలాలు తెలుసుకునేందుకు అమెరికా ప్రయత్నం

పరికరాల మూలాలు తెలుసుకునేందుకు అమెరికా ప్రయత్నం

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ , సీక్రెట్ సర్వీసెస్ శాఖలు దీన్ని ఇన్వెస్టిగేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అధికారులు ఎన్‌ఎస్ఏ, మరియు సీఐఏల సహకారం తీసుకున్నట్లు చెప్పారు .సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలను అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం ఎఫ్‌బీఐ ఇన్వెస్టిగేట్ చేస్తుందని మాజీ అధికారులు వివరించారు. ప్రస్తుతం దొరికిన పరికరాలను పరీక్షిస్తున్నట్లు తెలిపిని అధికారులు పరికరాల చరిత్ర ఏంటి, ఆ భాగాలను ఎక్కడ తయారు చేశారు, ఎప్పటి నుంచి వినియోగంలో ఉన్నాయి, ఎవరి చేతికి వెళ్లాయి అనే అంశాలు బయట పడితే దాని మూలాలు ఇతర అంశాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెప్పారు.

 మాకు నిఘా పెట్టాల్సిన అవసరం లేదు: బెంజమిన్ నెతన్యాహూ

మాకు నిఘా పెట్టాల్సిన అవసరం లేదు: బెంజమిన్ నెతన్యాహూ

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. తమకు అలాంటి అవసరం లేదని చెప్పారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ. అమెరికాపై నిఘా పెట్టకూడదని ఎప్పటినుంచో ఒప్పందం అమల్లో ఉందని ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. రష్యా పర్యటను బయలు దేరే ముందు నెతన్యాహూ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందిస్తూ ఆరోపణ పచ్చి అబద్ధం అని చెప్పారు. ఇక వార్త గురించి ప్రచారం చేసిన ఓ అంతర్జాతీయ పత్రిక మాత్రం ట్రంప్ సర్కార్ ఇజ్రాయిల్ పై ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోలేదని రాసుకొచ్చింది.

అమెరికా ఏం చేయగలదో ఒక్కసారి ఇజ్రాయిల్ ఊహించాలి

అమెరికా ఏం చేయగలదో ఒక్కసారి ఇజ్రాయిల్ ఊహించాలి

తమ దేశ అంతర్గత భద్రత కోసం ఇజ్రాయిల్ ఎంతదూరమైన వెళుతుందని అమెరికా మాజీ అధికారులు చెప్పారు. ఇందుకోసం తమ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇతర దేశాలపై నిఘా పెట్టిస్తుందని అధికారులు తెలిపారు. అమెరికాపై ఇజ్రాయిల్ నిఘా పెట్టడం కాస్త ఆందోళన కలిగించే విషయమైనప్పటికీ... తాము ఇజ్రాయిల్‌లో ఏమి చేయగలమో ఓసారి ఊహించాలని అమెరికా మాజీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అమెరికాపై ఇజ్రాయిల్ నిఘా పెట్టిందనేది పూర్తిగా అవాస్తవం అని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇజ్రయిల్ కట్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయిల్ అమెరికా దేశాలు కలిసి చాలా ఇంటెలిజెన్స్ సమాచారంను ఒకరికొకరితో పంచుకున్నాయని చెప్పిన మంత్రి.. ఇరుదేశాల భద్రతను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశామని చెప్పారు.

English summary
The Trump administration has concluded that Israel is responsible for the placement of cellphone surveillance equipment near the White House and at other sensitive locations in Washington, DC.Prime Minister Benjamin Netanyahu swiftly rejected the accusation as a “complete lie… Not a scintilla of truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X