వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరట్లో బాంబు ఉందంటూ పోలీసులకు ఫోను... తీరా వెళ్లి చూస్తే...

‘సార్‌.. సార్‌.. మా పెరట్లో బాంబు ఉంది. వెంటనే రండి..’ అని పోలీసులకు ఫోన్‌ చేశాడు ఓ పెద్దమనిషి. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లారు. తీరా పెరట్లోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: 'సార్‌.. సార్‌.. మా పెరట్లో బాంబు ఉంది. వెంటనే రండి..' అని పోలీసులకు ఫోన్‌ చేశాడు ఓ పెద్దమనిషి. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లారు. తీరా పెరట్లోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది బాంబు కాదు. వంకాయ!

జర్మనీలోని కార్ల్‌ష్రుహే ప్రాంతంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. కార్ల్‌ష్రుహే పోలీసులకు గురువారం ఓ ఫోన్ కాల్‌ వచ్చింది. అటువైపు నుంచి ఓ పెద్దాయన(81) మాట్లాడుతూ.. తమ ఇంటి పెరట్లో ఓ అనుమానాస్పద వస్తువు కన్పించిందని, అది రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబులా ఉందని గాభరాగా చెప్పారు.

Report of wartime bomb in Germany leads to courgette discovery

దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా ఆ పెద్దాయన ఇంటికి చేరుకుని పెరట్లో ఉన్నదాన్ని పరిశీలించారు. సదరు వస్తువు 40 సెంటీమీటర్ల పొడవుతో ముదురు నీలం రంగులో ఉంది. తొలుత పోలీసులు కూడా దాన్ని బాంబే అనుకున్నారు.

తర్వాత కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమైంది.. అది బాంబు కాదని వంకాయ అని. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ వంకాయ బరువు దాదాపు 5 కిలోలు ఉందట.
ఈ విషయాన్ని పోలీసులు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. వంకాయ ఫొటోను కూడా పోస్టు చేశారు.

బహుశా గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా దాన్ని పెద్దాయన ఇంటి పెరట్లోకి విసిరేసి ఉంటారని.. దానిని చూసిన ఆయన బాంబు అనుకుని కంగారు పడిపోయి తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడని పోలీసులు పేర్కొన్నారు.

English summary
A worried resident in Germany alerted police to what he thought was a second world war bomb in his garden. Officers found … a particularly large zucchini. Police were summoned to the scene in Bretten, near the south-western city of Karlsruhe, on Thursday morning by a worried 81-year-old man. They said in a statement Friday that officers determined “the object, which really did look very like a bomb” was actually a 40cm (nearly 16in) courgette. The offending vegetable, which was very dark in color, weighed about 5kg (11lbs). Police believe someone threw it over a hedge into the garden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X