వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్.. టీవీ చానెల్ లైవ్‌లో రిపోర్టర్ బ్లండర్ మిస్టెక్..

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఉదయాన్నే లేచి.. హడావుడిగా ఆఫీసులకు పరిగెత్తే అవసరం లేకుండా పోయింది. రోజూ ధరించే ఫార్మల్స్ అవసరం కూడా ఇప్పుడు లేదు. షార్ట్స్,టీషర్ట్స్‌లో రిలాక్స్‌గా కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్‌ కానిచ్చేస్తున్నారు. అయితే ఇదే ఫార్ములాను అప్లై చేసిన ఓ రిపోర్టర్ అడ్డంగా బుక్కైపోయాడు.

ఏబీసీ ఛానెల్‌కి చెందిన ఓ రిపోర్టర్(27) ఇటీవల 'గుడ్ మార్నింగ్ అమెరికా' కార్యక్రమంలో.. ఫార్మసీలు డ్రోన్స్ ద్వారా ప్రిస్క్రిప్షన్ మందులను పేషెంట్లకు ఎలా సప్లై చేస్తున్నారో వివరించాడు. అయితే కెమెరా కాస్త క్లోజ్ షాట్‌లో ఉన్నంతవరకు అంతా బాగానే ఉంది.కానీ చివరలో న్యూస్ రూమ్‌తో పాటు అతను కూడా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చినప్పుడు గానీ అసలు విషయం బయటపడలేదు. ఆ వీడియోలో అతను ప్యాంట్స్ ధరించకపోవడం స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆ వీడియోను షేర్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతా కరోనా మాయ అని.. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో వచ్చిన తిప్పలని అభిప్రాయపడుతున్నారు.

Reporter Caught Without Pants During Live Broadcast In WFH Blunder

సదరు రిపోర్టర్ కెమెరా యాంగిల్‌ను సరిగా సెట్ చేసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే.. లాక్ డౌన్‌కు అలవాటుపడి ప్యాంట్స్ వేసుకోవడం తగ్గిపోయిందని.. అందుకే రిపోర్టింగ్‌లోనూ అతను బాక్సర్లే ధరించాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

English summary
Working from home comes with its own set of perks - lounging comfortably on the bed or couch during office hours, unlimited snacking and wearing whatever you want.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X