వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్‌హౌస్‌కి బాంబు బెదిరింపు: పరుగులు తీశారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వైట్‌హౌస్‌లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మీడియా సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించే సమయంలో బాంబు ఉందంటూ ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది.

ఏం చేద్దామని యోచిస్తుండగా మరో ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా బాంబుకి సంబంధించిన ఫోన్ కాల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్రెస్ బ్రీఫింగ్ రూం, యుఎస్ సెనెట్ ఆఫీస్ భవనాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

 Reporters evacuated from White House after bomb threat

దీంతో ఒక్కసారి ఉద్యోగులు, విలేకరులంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, డాగ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని తేల్చారు. బాంబు లేదని తేలిన అరగంట తర్వాత విలేకరులు మళ్లీ సమావేశానికి హాజరయ్యారని వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఇయర్ నెస్ట్ వెల్లడించారు.

బాంబు ఉందని ఫోన్ కాల్స్ రావడం కాకతాళీయమా? లేక కావాలని చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆ సమయంలో ఒబామా ఓవెల్‌ ఆఫీసులో ఉండగా, ఆయన భార్య మిచెల్‌, మిగిలిన కుటుంబ సభ్యులు వైట్‌హౌస్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు.

English summary
White House reporters were evacuated from the media briefing room here in the middle of a press conference by the presidential spokesperson after law enforcement agencies received a bomb threat call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X